- పెద్ద బూట్ స్పేస్ ను కలిగి ఉన్న మోడల్
- మూడు స్క్రీన్‌లతో అమర్చబడిన డ్యాష్‌బోర్డ్
మహీంద్రా అప్ కమింగ్ (రాబోయే) ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియాలోని వివిధ ప్రాంతాలలో టెస్టింగ్ చేస్తూ కనిపించాయి. మహీంద్రా XUV.e9 ఇటీవలే ముంబైలోని రద్దీగా ఉన్న ట్రాఫిక్‌లో టెస్టింగ్ చేస్తుండగా కనిపించింది.
XUV.e9 అనేది ఎలక్ట్రిక్ XUV700 (XUV.e8) కూపే వెర్షన్, మరియు ఇది వాలుగాఉన్న రూఫ్ ను కలిగి ఉన్నప్పటికీ, టెస్టింగ్ మ్యూల్స్ రెండు 20-ఇంచ్ టైర్‌లను బ్యాకప్ గా కలిగి ఉండడం వల్ల టెస్టింగ్ కోసం తగినంత బూట్ స్పేస్ కూడా ఉంది. ఈ కారు టెయిల్‌ల్యాంప్స్ లో ఒకే విధమైన డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లను కూడా పొందుతుంది. ముందే నిర్ధారించినట్లుగా, ఛార్జింగ్ పోర్ట్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌తో ఈవీ భారీ అల్లాయ్ వీల్స్‌పై రైడ్ చేయగా, ఫ్రంట్ పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్‌ను పొందుతూ XUV.e8 ని పోలి ఉన్న డిఆర్ఎల్స్ ను కూడా కలిగి ఉంటుంది.
లోపలి భాగంలో చూస్తే, ఈవీలో అతిపెద్ద హైలైట్ ఏంటి అంటే మూడు భారీ స్క్రీన్స్ తో రావడం – ఈ మూడు ఒక్కోటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కో-ప్యాసింజర్ కోసం అందిచబడ్డాయి. మరోక హైలైట్ ఏంటి అంటే, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఇది ప్రకాశవంతమైన (ఇల్యూమినేటెడ్) మహీంద్రా లోగోను కలిగి ఉండవచ్చు. అలాగే, సెంటర్ కన్సోల్ డ్రైవింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఇ-బ్రేక్ మరియు మరిన్నింటిని సూచించే నాబ్స్ బటన్‌లను కూడా పొందుతుంది. అంతేకాకుండా, ఈకారు బాడీ-హగ్గింగ్ సీట్స్ పుష్కలంగా ప్యాసింజర్ నడుము మరియు తొడలకు సపోర్ట్ ని అందిస్తాయి. రెండవ వరుసలో కూడా, ఎయిర్ కాన్ బ్లోయర్‌లతో పాటు మరింత స్థలం పొందవచ్చు.
XUV.e9 పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్
XUV.e9 అధికారిక స్పెక్స్, బ్యాటరీ గురించి మహీంద్రా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు, కానీ అప్ కమింగ్ (రాబోయే)ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ 60-80kWh రేంజ్ మధ్య ఉంటుందని చెప్పబడింది.ఇది ప్రీమియం ఈవీగా మార్కెట్లోకి వస్తుండగా , ఇది ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడిన అతిపెద్ద 80kWh బ్యాటరీని ప్యాక్ ను పొందుతుందని మేము భావిస్తున్నాము.ఒకే ఛార్జ్‌పై ఈ మోడల్ 450-500కిమీ రేంజ్ ని చేరుకుంటుందని కంపెనీ నిర్దారించగా, టెస్టింగ్ చేస్తున్న సమయంలో టెస్ట్ మ్యూల్ 369కిమీ రేంజ్ ని మాత్రమే అందించింది.
అనువాదించిన వారు: రాజపుష్ప