- XUV700 బేస్డ్ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యువి వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని అంచనా
- ప్రొడక్షన్ కి రెడీగా ఉన్న అవతార్‌లో కనిపించిన XUV.e9
మహీంద్రా 2025 ప్రారంభంలో జరగబోయే దాని మార్కెట్ అరంగేట్రం కంటే ముందుగా XUV.e9 పై టెస్టింగ్ ను కొనసాగిస్తోంది. బ్రాండ్ నుంచి వస్తున్న వివిధ ఈవీలలో భాగంగా ఈ సంవత్సరం చివర నుంచి వీటిని మహీంద్రా ప్రారంభించనుంది, అందులో మొదటగా XUV700-బేస్డ్ XUV.e8 మోడల్ రానుంది.
ఈ ఉత్పత్తికి సిద్ధంగా (ప్రొడక్షన్ రెడీ) ఉన్న కారులోని కనిపించగా, కొత్త మహీంద్రా XUV.e9 అనేక ఫీచర్స్ ను పొందగా, వీటిలో డాష్‌బోర్డ్‌లో మూడు (3)-స్క్రీన్ సెటప్, న్యూ టూ-స్పోక్ మల్టీఫంక్షన్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవ్ మోడ్స్ కోసం రోటరీ డయల్, న్యూ గేర్ లీవర్ మరియు ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్ వంటివి ఉన్నాయి.
బయటి భాగంలో, 2025 XUV.e9 న్యూ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, నిలువుగా అమర్చిన న్యూ హెడ్‌ల్యాంప్స్, ఎల్- షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ఎస్ , కారుముందు మరియు వెనుక వైపున ఎల్ఈడీ లైట్ బార్, పనోరమిక్ సన్‌రూఫ్, సి-పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ సెట్ వంటి వాటిని అందుకుంది .
మహీంద్రా కేవలం XUV.e9 వివరాలు మాత్రమే కాకుండా, దాని అప్ కమింగ్ (రాబోయే) ఈవీ రేంజ్ కి సంబంధించిన పూర్తి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరాలు ప్రస్తుతానికి మహీంద్రా వెల్లడించలేదు. ఈ మోడల్ 60-80kWh బ్యాటరీ ప్యాక్ ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి వస్తుందని మేము ఆశిస్తున్నాము. అలాగే, XUV700-బేస్డ్ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యువి ని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 500కిమీల రేంజ్ ని అందిస్తుందని అంచనా.
అనువాదించిన వారు: రాజపుష్ప