- 2025లో లాంచ్ అయ్యే అవకాశం
- 450కి.మీ క్లెయిమ్డ్ రేంజ్ నిపొందనున్న XUV.e9
మహీంద్రా తన అన్ని ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌లతో పాటు XUV.e9ని కూడా 2022 చివరిలో ఆవిష్కరించింది. దీని ఆటోమేకర్ 2025లో ఈ మోడల్‌ను లాంచ్ చేయనుంది. దాని అధికారిక అరంగేట్రానికి ముందే, ఈమోడల్ ఇటీవల ఇండియాలో టెస్ట్ చేస్తూ మళ్ళీ కనిపించింది.
ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా, ఈ మోడల్ సైబర్-ప్యాటర్న్డ్ ర్యాప్‌లో పూర్తిగా కవర్ చేయబడింది. మనకు కనిపిస్తున్నఇతర డిజైన్ అంశాలలో కనెక్ట్ చేయబడిన లుక్‌తో ఎల్ఈడీటెయిల్‌లైట్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, పొడిగించిన రూఫ్ స్పాయిలర్ మరియు ఇంటిగ్రేటెడ్ హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
ముందుగా దీని కొలతల గురించి చెప్పాలంటే, XUV.e9 పొడవు 4,790 ఎంఎం, వెడల్పు 1,905 ఎంఎం మరియు ఎత్తు 1,690 ఎంఎం ఉండనుంది. అలాగే, వీల్‌బేస్ దాదాపు 2,775 ఎంఎంఉండనుంది. ఈ కూపే ఎస్‌యువి ఫోక్స్‌వ్యాగన్ తో పంచుకున్న ఐఎన్‌జిఎల్ఓ (INGLO) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.
మునుపటి స్పై షాట్‌లు, XUV.e9 యొక్క ఇంటీరియర్ భాగం లో అనేక కీలక వివరాలనులీక్ చేశాయి . ఇందులో మూడు-స్క్రీన్ సెటప్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, న్యూసెంటర్ కన్సోల్ మరియు XUV400 మాదిరిగానే డ్రైవ్ మోడ్ సెలెక్టర్ లీవర్ ఉన్నాయి.
లాంచ్ తర్వాత, ఇండియన్ ఆటోమేకర్ నుండి వచ్చిన ఆల్-ఎలక్ట్రిక్ కూపే 80kWh బ్యాటరీ యూనిట్‌ని ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారుగా 450కి.మీ.డ్రైవింగ్ రేంజ్ ని అందించనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప