- ఏప్రిల్ 2025న లాంచ్ కానున్న XUV.e9
- త్వరలోనే ఇండియన్ మార్కెట్ లో ఉత్పత్తి కానున్న మోడల్
మహీంద్రా XUV.e9 ఎలక్ట్రిక్ ఎస్‌యువి మరోసారి టెస్టింగ్ చేస్తూకనిపించింది. ఈసారి ,XUV.e9 కారు భారీగాకామోఫ్లేజ్ తో కప్పబడి ఉండగా, ఇది ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్ అని, ఇప్పటి నుండి సరిగ్గా ఒక సంవత్సరం లోపులాంచ్ కానున్నట్లు సూచిస్తుంది.
కూపే- ఎస్‌యువి లైన్స్
ఇక్కడ చిత్రాలలో చూస్తే, నిలువుగా అమర్చిన టెయిల్‌ల్యాంప్స్, ఏరోడైనమిక్ స్పాట్‌లతో కూడిన పెద్ద వీల్స్ మరియు వెనుకవైపు భారీ లుక్ తో వంపుతిరిగిన లైట్ బార్‌తో ప్రత్యేకంగా పెద్ద ఫేస్ ని మనం చూడవచ్చు. ఇంకా చెప్పాలంటే, బూట్ లిడ్‌లోకి మందంగా ఉండే సి-పిల్లర్ ని కూడా మీరు చూడవచ్చు, ఇది కారుకు ప్రత్యేకమైన లుక్ ని అందిస్తుంది. XUV.e9 మహీంద్రా నుంచి వస్తున్న మొదటి కూపే ఎస్‌యువి మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వెర్షన్ లో ఒకటి! XUV700- బేస్డ్ XUV.e8 ఈ సంవత్సరం చివరిలో లాంచ్ అవుతుండగా, దీని తర్వాత XUV.e9 రానుంది.
ఇతర కార్లతో పోలిస్తే ఇదే మొదటిది
టాటా కర్వ్ ఈవీ మార్కెట్లో మొదటి ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యువి అయినప్పటికీ, XUV.e9 టాటాకి పోటీగా మొదటగా ధరతో మరియు ఇతర మానుఫాక్చరర్లు బాడీ స్టైల్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది.లగ్జరీ సెగ్మెంట్ మాదిరిగానే, ఈకూపే-ఎస్‌యువి బాడీ స్టైల్ తదుపరి పెద్ద పోటీ అని చెప్పవచ్చు. ఇది ఎస్‌యువి స్టాన్స్‌ను అందించడమే కాకుండా, ఆ స్టాండ్-అవుట్ లుక్ కోసం సెడాన్- లేదా స్పోర్ట్స్ కార్ లాంటి స్టైలింగ్‌తో ఉంటుంది.
BE.05వివరాలు
ఇప్పటికే BE.05 కార్ షేప్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్, కార్ ఫంక్షన్స్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు మరింతగా నచ్చే డ్యాష్‌బోర్డ్-వైడ్ డిజిటల్ డిస్‌ప్లేను పొందే మొదటి మహీంద్రా మోడల్‌లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. స్పై చిత్రాలు పూర్తిగా బ్లాక్ కలర్ క్యాబిన్ తో కొత్త మహీంద్రా టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను సూచిస్తాయి. ఈ ఏడాది చివరిలో లాంచ్ అయినప్పుడు XUV.e8లో కూడా వచ్చే అన్ని అంశాలు ఇవే. ఇది 500 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ ని కలిగి ఉంటుందని మరియు అనేక రకాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందించబడుతుంది అంచనా.
అనువాదించిన వారు: రాజపుష్ప