- 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్ పొందే అవకాశం
- 3-స్క్రీన్‌లు, వైట్ అప్హోల్స్టరీ మరియు మరిన్నింటిని ఫీచర్లతో రానున్న మోడల్
మహీంద్రా దాని అప్ కమింగ్ (రాబోయే)మోడళ్లతో ఈవీ ఇండియన్ మార్కెట్లో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. అలాగే, ఆటోమేకర్ వచ్చే ఏడాది నుంచి పలు ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ లిస్ట్ లో XUV700-బేస్డ్ కూపే ఎస్‌యువి, ఎక్స్‌యువి.e9 కూడా ఉన్నాయి. ఇవి అనేక సందర్భాల్లో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఇప్పుడు, మరోసారి స్పై చిత్రాలు రాబోయే ఈవీ గురించి మరింత సమాచారాన్ని అందించాయి.
XUV700 కూపే ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ దాని ఎక్స్‌టీరియర్ లో ఈవీ కొద్ది కొద్దిగా మార్పులను పొందుతుంది. ముందు భాగంలో, ఫేసియా పూర్తి-వెడల్పు లైట్ బార్ మరియు స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ సెటప్‌తో బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్‌ను పొందుతుంది. అంతేకాకుండా, స్పై చిత్రాల ప్రకారం, XUV.e9 కారు 245/55 R టైర్లతో 19-ఇంచ్ ఏరో-ప్యాటర్న్డ్ వీల్స్‌పై రైడ్ చేస్తుంది.
XUV.e9 లోని మరిన్ని ఆసక్తికరమైన డిజైన్ అంశాలలో, ఛార్జింగ్ ఫ్లాప్ ఉండగా, ఇది కనెక్ట్ చేయబడిన టెయిల్‌ల్యాంప్‌ల క్రింద వెనుక భాగంలో అమర్చి ఉంది. ఈవీ ఛార్జింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి గ్లోయింగ్ ఇండికేటర్ ను కూడా పొందుతుంది.
లోపలి భాగంలో, కూపే ఈవీ డాష్‌బోర్డ్‌లో 3-స్క్రీన్ సెటప్‌ను పొందుతుందని తెలిసింది. కొత్త స్పై చిత్రాలు వైట్ మరియు బ్లాక్ క్యాబిన్ థీమ్‌తో పాటు వైట్ సీట్స్ అప్హోల్స్టరీని వెల్లడిస్తున్నాయి. XUV.e9 కారు లెవెల్- 2 ఏడీఏఎస్ (ఎడాస్)సూట్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, బెజెల్-లెస్ ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, వెంటిలేషన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్స్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, మరియు బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీల సరౌండ్ కెమెరా వంటి వివిధ హై-ఎండ్ ఫీచర్‌లతో వస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప