- వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం
- ఎలక్ట్రిక్ కూపే-ఎస్‍యువి
XUV.e9 మహీంద్రా నుండి వస్తున్న రాబోయే కొత్త ఎలక్ట్రిక్ ఎస్‍యువిలలో ఒకటి, క్యాబిన్ కు సంబంధించి కొత్త స్పై పిక్చర్స్ ఈ ఎలక్ట్రిక్ కూపే-ఎస్‍యువిలోని కొత్త వివరాలను వెల్లడిస్తున్నాయి.
ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న XUV.e9 కొత్తగా అభివృద్ధి అయిన ఐఎన్‍జిఎల్ఓ ప్లాట్‌ఫారమ్ పై తయారుకానుంది. అయితే, ఇందులోని క్యాబిన్ మీరు సాధారణ ఈవీలలో చూసిన క్యాబిన్ కు సమానంగా కాకుండా సాధారణంగా ఉండనుందని ఇంటీరియర్ షాట్‌లు వెల్లడిస్తున్నాయి.
మనం భారీ సెంటర్ కన్సోల్‌తో పాటుగా డాష్‌బోర్డ్ మొత్తానికి విస్తరించి ఉన్నపెద్ద స్క్రీన్‌ని చూడవచ్చు. సెంటర్ కన్సోల్‌లో, రెండు రోటరీ డయల్స్ మరియు ఒకే రకమైన గేర్ లీవర్ ఉన్నాయి. రోటరీ డయల్స్ నూర్లింగ్ ఎఫెఫ్ట్ కలిగి ఉన్నట్లు కనిపిస్తాయి మరియు అందులో ఒకటి డ్రైవ్ మోడ్‌లను కంట్రోల్ చేసే అవకాశం ఉంది, మరొకటి ఎడబ్ల్యూడి మోడ్‌లను మార్చడం లేదా సెంటర్ మల్టీమీడియా స్క్రీన్‌ను కంట్రోల్ చేసే విధంగా ఉంది. అదే విధంగా, ఇందులో ఉన్న గేర్ లీవర్ ను మీరు ఎలక్ట్రిక్ ఎక్స్‌యువి400లో కూడా చూడవచ్చు.
స్క్రీన్ విషయానికొస్తే, ఇందులో ఉన్న సెంటర్ కన్సోల్ ఇంతకు ముందు కంటే మరింత పెద్దదిగా ఉంది మరియు ఫ్రంట్ ప్యాసింజర్స్ సెక్షన్ వైపు మూడు స్క్రీన్‌లు ఉన్నాయి. భారీగా దాగి ఉన్న టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా కొత్తగా మరియు టచ్‌స్క్రీన్ వెనుక హెచ్‍యూడీ కోసం కన్సోల్ ఉన్నట్లు కనిపిస్తుంది.
ఇండియన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు, XUV.e9 ( ఇది లాంచ్ అయితే వేరే పేరుతో ఉండవచ్చు) 80kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది సింగిల్-మోటార్ మరియు డ్యూయల్-మోటార్ ఎడబ్ల్యూడి కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. పవర్ ఫిగర్స్ 230bhp మరియు 350bhp మధ్య ఉండవచ్చు, అయితే క్లెయిమ్డ్ 450 కి.మీ. రేంజ్ ని ఇచ్చే అవకాశం ఉంది.
పొజిషనింగ్ వారీగా, XUV.e9 స్టాండర్డ్ XUV.e8 కంటే బెటర్ పొజిషన్ లో ఉండనుండగా మరియు దీని ధర దాదాపుగా రూ. 50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప