- XUV700ఎస్‍యూవీ ఆధారంగా వస్తున్నXUV.e9
- వచ్చే సంవత్సరంలో అరంగేట్రం
మహీంద్రా కంపెనీ ఈ సంవత్సరం చివరి నాటికి మరియు 2025 సంవత్సరంలో లాంచ్ అయ్యే వివిధ మోడల్స్ పై తయారీపై ఫోకస్ చేస్తుంది. అందులో ప్రస్తుతం XUV.e9గా పిలువబడుతున్న XUV700-బేస్డ్ ఆల్-ఎలెక్ట్రిక్ కూపే వచ్చే సంవత్సరం లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. XUV700 కారు స్ఫూర్తితో ఈ ఎలక్ట్రిక్ కారు వస్తుండగా, ఎలక్ట్రిక్ కూపే ఎస్‍యూవీలో మరిన్ని ఫీచర్లు మరియు టెక్ ఫీచర్లు అందించబడతాయి.
ఇక్కడ ఫోటోలో చూసిన విధంగా, XUV.e9లో అందించబడే ఇంటీరియర్ XUV700 లాగా ఉంటుంది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కనెక్టెడ్ ట్విన్ డిస్‌ప్లేలు, సీటును అడ్జస్ మెంట్ కోసం డోర్ ప్యానెల్ మౌంటెడ్ స్విచ్‌లు, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం మరియు కొత్త గేర్ లివర్‌తో రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లతో రానుంది. ఇతర ముఖ్యమైన అంశాలలో ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో ఇల్యూమినేటెడ్ లోగో మరియు వెంటిలేషన్ ఫంక్షన్ కోసం చిన్న చిన్న రంధ్రాలతో కూడిన వైట్ సీట్ అప్హోల్స్టరీ వంటివి ఉన్నాయి.
అదే విధంగా, ఇతర స్పై ఫోటోలలో చూస్తే రాబోయే (అప్ కమింగ్) కూపే ఎస్‍యూవీలో అందించబడే బూట్‌స్పేస్‌ను వెల్లడవ్వగా, ఇది స్ప్లిట్ ఫంక్షన్‌ను అందించేందుకు ముందు సీటుతో భారీ లుక్ తో కనిపిస్తుంది. అలాగే, బూట్‌స్పేస్‌ను ప్రదర్శించేందుకు మొత్తం టెయిల్‌గేట్ సెక్షన్ మరింతగా పెరగనుంది, ఇది పవర్డ్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ఫంక్షన్‌తో అందించబడుతుందని మేము భావిస్తున్నాము.
స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, XUV.e9 ఎలక్ట్రిక్ కూపే బ్యాటరీ ప్యాక్ మరియు డ్రైవింగ్ రేంజ్ వివరాలను మహీంద్రా కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఏది ఏమైనప్పటికీ, ఈ ఎలక్ట్రిక్ మోడల్ ఒక పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో అందించబడుతుందని మేము భావిస్తున్నాము, దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 500-600కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందించనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్