- XUV.e8 ప్రారంభం కానున్న కొత్త ఈవీ
- XUV700తో పోలిస్తే భిన్నమైన ఫాసియా మరియు వెనుక భాగాన్ని కలిగి ఉంటుంది
ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ చివరిలో మొదటిసారిగా దాని ప్రదర్శన జరగడానికి ముందు, మహీంద్రా XUV700-ఆధారిత XUV.e8 ఎలక్ట్రిక్ ఎస్‌యువి మరోసారి ఈ కారు టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఈ కారు సైజ్ పరంగా మరియు ఫీచర్ల పరంగా చూస్తే, దాదాపు మహీంద్రా XUV700 ఆధారంగా వస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే, వెబ్‌లో షేర్ చేసిన కొత్త స్పై షాట్‌లలో ఈ కారు ఇంటీరియర్‌కు సంబంధించిన కొత్త వివరాలు వెల్లడయ్యాయి.
ఇక్కడ ఉన్న చిత్రాలలో చూసినట్లుగా, కొత్త XUV.e8 డాష్‌బోర్డ్‌ను చూడడానికి చాలా ఆకర్షణీయంగా చేసే మూడు-స్క్రీన్ సెటప్‌ను పొందుతుంది. ఇది పూర్తి డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం అదనపు డిస్‌ప్లేతో కూడిన సింగిల్-పీస్ యూనిట్ యూనిట్‌గా ఉంటుంది. అలాగే, ఈ వివరాలు గతంలో లీక్ అయిన పేటెంట్ ఇమేజ్‌లో మేము ప్రత్యేకంగా వెల్లడించాము. రెండోది కొత్త హెడ్‌ల్యాంప్ మరియు కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ డిజైన్‌ను కూడా పొందుతుందని నిర్ధారించబడింది.
బయటి భాగంలో , 2025 మహీంద్రా XUV.e8 దాని ఐసీఈ వేరియంట్ నుండి వేరుగా కనిపించేందుకు రివైజ్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త సెట్ ట్రయాంగులర్ హెడ్‌ల్యాంప్స్ మరియు కొత్త గ్రిల్ ను కూడా మీరు చూడవచ్చు. ఇది మొత్తం సిల్హౌట్ మరియు ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
కొత్త XUV.e8 కి సంబంధించిన పూర్తి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరాలు ప్రస్తుతానికి మహీంద్రా వెల్లడించలేదు. ఈ మోడల్ 80kWh బ్యాటరీ ప్యాక్ ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి వస్తుందని మేము ఆశిస్తున్నాము. అలాగే, ఇది లాంచ్ అయిన తర్వాత, అప్ కమింగ్ (రాబోయే) టాటా హారియర్ మరియు సఫారి ఈవీ వంటి వాటితో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప