- ఈ సంవత్సరం చివరలో రావచ్చని అంచనా
- ఎక్స్‌యువి700 ఆధారంతో వస్తున్న ఈవీ
మహీంద్రా ఈ ఏడాది చివర్లో ఎక్స్‌యువి700- బేస్డ్ ఎక్స్‌యువి.e8 ఎలక్ట్రిక్ ఎస్‌యువిని పరిచయం చేయనుంది. దాని అధికారిక అరంగేట్రానికి ముందే, దాదాపుగా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ఈ మోడల్ కెమెరా కంటికి చిక్కింది. దీని లుక్ చూస్తే అన్ని విధాలుగా చాలా వైభవంగా కనిపించింది.
ఇక్కడ చిత్రంలో చూసినట్లుగా, ఎక్స్‌యువి.e8 ఈవీ బ్లాక్ కలర్లో ఒఆర్‍విఎంఎస్ మరియు క్లాడింగ్‌తో పాటు వైట్ కలర్ ఫినిషింగ్ తో కనిపించింది. మిగిలిన చోట్ల, ఇది కొత్త ఫ్రంట్ బంపర్, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్ మరియు కొత్త ఎయిర్ డ్యామ్‌ను పొందుతుంది మరియు ముందు భాగంలో కప్పపబడిన భాగం పూర్తి-నిడివి గల ఎల్ఈడీ లైట్ బార్ మరియు నిలువుగా అమర్చిన హెడ్‌ల్యాంప్‌ల సెట్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో ట్వీక్ చేయబడిన బంపర్ మరియు అప్‌డేట్ ఎల్ఈడీ టైల్‌లైట్‌ల సెట్‌ను పొందే అవకాశం ఉంది. తర్వాత, సైడ్ ప్రొఫైల్‌లో కొత్త అల్లాయ్ వీల్స్ మరియు ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ గ్లాస్ బ్లాక్ షేడ్‌లో ఉన్నాయి.
లోపల చూస్తే, కొత్త మహీంద్రా ఎక్స్‌యువి.e8, ఇటీవలి స్పై షాట్‌ల ఆధారంగా, కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త గేర్ లీవర్, సెంటర్ కన్సోల్‌లో రోటరీ డయల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు బహుశా మూడవ స్క్రీన్ కూడా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా రెండోది ప్యాసింజర్-సెంట్రిక్ ఫీచర్ కూడా ఉండవచ్చు.
పవర్డ్ 2024 ఎక్స్‌యువి.e8 యొక్క 80kWh బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి రావచ్చు. ముందుగా దీని కొలతల గురించి చెప్పాలంటే, ఈ మోడల్ 4,740ఎంఎంపొడవు 2,762ఎంఎం వీల్‌బేస్ ఉండనుంది. లాంచ్ తర్వాత, ఈ మోడల్ టాటా హారియర్ ఈవీతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప