- XUV700 ఎలక్ట్రిక్ వెర్షన్ ఇదే
- ఐఎన్‌జిఎల్ఓ ప్లాట్‌ఫారమ్‌పై తయారవుతున్నఎలక్ట్రిక్ వెహికిల్స్
మహీంద్రా XUV.e8 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ప్రోటోటైప్ ఇటీవల ముంబైలో కనిపించింది, దీని ద్వారా అప్ కమింగ్ (రాబోయే) ఈవీ కి సంబంధించిన కొన్ని అదనపు వివరాలు వెల్లడయ్యాయి.
XUV.e8 XUV700 లోని మొత్తం సిల్హౌట్‌ను నిర్వహిస్తుంది, అయితే దాని ఎలక్ట్రిక్ నేచర్ దాని ఫాసియాపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాముఖ్యమైన ఎయిర్ ఇన్‌టేక్‌లు లేకుండా స్లాబ్ లా ఉండే బంపర్స్ మరియు ఏడీఏఎస్ (ఎడాస్) సెన్సార్స్ త్వరిత నిర్ధారణను అందిస్తాయి. అలాగే, డిజైన్‌లో భాగంగా నిలువుగా అమర్చిన హెడ్‌ల్యాంప్ యూనిట్లను మహీంద్రా పేటెంట్ లో చేర్చింది. ఇటీవల అనేక ఈవీలలో కనిపించే విధంగా ఈ కారు కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ బార్‌ను కలిగి ఉంది.అలాగే, కారు వెనుక భాగం మాత్రం ప్రస్తుత XUV700కి సమానంగా ఉంటుంది.
దీని పేటెంట్స్ గురించి చెప్పాలంటే, కార్‌మేకర్ ట్రిపుల్ స్క్రీన్‌తో కొత్త డాష్‌బోర్డ్ డిజైన్ లో కూడా ఒకదాన్ని ఇందులో చేర్చింది. ఈ కారు XUV.e9లో ఉన్న ఫీచర్లతో పాటుగా అమర్చబడుతుంది. అంతేకాకుండా, ఈ కారు ఇంటీరియర్ కొత్త టాటా సఫారీలో ఉన్నటువంటి టూ-స్పోక్ స్టీరింగ్‌ను కూడా పొందుతుంది.XUV.e8 లో సెంటర్ కన్సోల్, అలాగే, అనువైన ఆటోమేటిక్ గేర్ సెలెక్టర్ మరియు డ్రైవింగ్ మోడ్‌ల కోసం డయల్ ఉంటుంది.
మహీంద్రాXUV.e8 పవర్‌ట్రెయిన్ ఆప్షన్
కార్‌మేకర్ ఇతర ఎలక్ట్రిక్ ఎస్‌యువిల వలె,ఈ బ్రాండ్ ఐఎన్‌జిఎల్ఓ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా మహీంద్రా XUV.e8ని తీసుకువస్తుంది.ఈ ఈవీ సింగిల్ లేదా డ్యూయల్-మోటార్ సెటప్ ను పొందుతుందని మరియు 80kWh బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. కాకపోతే దీని ఆటోమేకర్ పవర్ అవుట్‌పుట్ రేటింగ్‌ను ఇంకా ప్రకటించలేదు.
అనువాదించిన వారు: రాజపుష్ప