- ఎక్స్‌యూవీ700 ప్లాట్ ఫారం నుంచి వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ
- 2024 చివరలో అరంగేట్రం చేసే అవకాశం
త్వరలో ఇండియాలో రానున్న ఆల్- ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ700, XUV.e8 లను ఇండియన్ ఆటో కార్ దిగ్గజం మహీంద్రా యాక్టివ్ గా టెస్టింగ్ చేస్తూనే ఉంది. ఈ వెహికిల్స్ ఎన్నోసార్లు టెస్ట్ మ్యూల్ షీట్ తో కప్పబడి టెస్టింగ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ సమయంలో ఈ వెహికిల్ యొక్క ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ కి సంబంధించి ఎన్నో కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి. మొత్తానికి, తాజాగా కనిపించిన స్పై ఫోటోలలో, మోడల్ యొక్క ఫ్రంట్ ఫాసియాను టెస్ట్ మ్యూల్ ద్వారా దాచి ఉంచినా, కీలక వివరాలు వెల్లడయ్యాయి.
మనకు కనిపిస్తున్న ఫోటో ప్రకారం, ఈ మోడల్ ఫ్రంట్ ప్రొఫైల్ పూర్తిగా డే టైం రన్నింగ్ ఎల్ఈడీ లైట్ బార్ తో వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఈ మోడల్ లుక్ టాటా హారియర్ మరియు సఫారి ఫేస్ లిఫ్ట్స్ లాగానే ఉండనుంది. అప్పుడు, టెస్ట్ మ్యూల్ పాడ్ లాంటి డిజైన్‌తో వర్టికల్ గా అమర్చబడిన స్ప్లిట్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్ సెటప్‌ను పొందవచ్చు.
ఈ మోడల్ వెనుక భాగం చూస్తే, టెస్ట్ మ్యూల్ లుక్స్ అచ్చం ఎక్స్‌యూవీ700లో ఉన్నట్లుగా యారో-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రియర్ వైపర్, షార్క్-ఫిన్ యాంటెన్నా, మరియు హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వంటి ఫీచర్స్ ని కలిగి ఉంది. అలాగే దీని రియర్ బంపర్ కూడా ఐసీఈ వెర్షన్ లాగా ఉండనుంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇంతకు ముందు స్పై షాట్స్ ఇందులో 3-స్క్రీన్ సెటప్ ను జత చేసినట్లు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఇందులో ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు కో-డ్రైవర్‌కు ఎడమ వైపు ఉన్నాయి. అంతేకాకుండా, ఇది XUV400 లాగా డ్రైవ్ సెలెక్టర్ లీవర్‌తో ఒకే రకమైన సెంటర్ కన్సోల్ లేఅవుట్‌ను పొందవచ్చు.
ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, కొలతల పరంగా XUV.e8 వెహికిల్ 2,762 వీల్ బేస్ తో 4,740mm పొడవు ఉంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ తో 80kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చే అవకాశం ఉంది.
అలాగే ఇది మార్కెట్లోకి ఎప్పుడు రానుంది అంటే, రాబోయే సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ మోడల్ రేంజ్ లో వస్తున్న వాటిలో మొదటగా మహీంద్రా XUV.e8ని లాంచ్ చేయడానికి ఈ ఆటోమేకర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాక రాబోయే హారియర్ ఈవీతో పోటీ పడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్