- వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచి ఈవీ రేంజ్ వెహికిల్స్ ని లాంచ్ చేయనున్న మహీంద్రా
- ఐసీఈ-పవర్డ్ XUV700 అధారంగా వస్తున్న XUV.e8
2022 సంవత్సరం ఆగస్టు నెలలో, యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)లో జరిగిన ఓ ఈవెంట్లో వివిధ ఎలక్ట్రిక్ మోడల్స్ ని మహీంద్రా ప్రదర్శించింది. ఈ ఈవీలు అన్ని ఈ సంవత్సరం చివరలో ఆవిష్కరించి, వచ్చే సంవత్సరం 2025లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తుంది.
మహీంద్రా నుంచి XUV.e8 మొదటి ఈవీ కారు రానుండగా, అరంగేట్రానికి ముందే ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీకి సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. పేటెంట్ డిజైన్లు మహీంద్రా XUV.e8 ప్రొడక్షన్-రెడీ ఎక్స్‌టీరియర్ వివరాలను వెల్లడిస్తున్నాయి. అలాగే ఇది ఓవరాల్ సిల్హౌట్ ని తిరిగి పొందుతుండగా, భారీ ఎత్తున డిజైన్ అంశాలను, కారు అంతటా చూస్తే, కొంతమేర కాపర్-కలర్డ్ ఇన్సర్ట్ లను, ఏరో-ఇంస్పైర్డ్ వీల్స్, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్, మరియు నిలువుగా అమర్చిన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వంటి వాటిని పొందింది. అలాగే కారు ముందు భాగంలో ఎల్ఈడీ లైట్ బార్ ని కూడా మహీంద్రా అందించనుంది.
2024 మహీంద్రా XUV.e8 ఇంటీరియర్ ని చూస్తే, ఇది త్రీ-స్క్రీన్ సెటప్ ఫీచర్ తో రానుంది. డ్రైవర్ సీట్ –ఫేసింగ్ యూనిట్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ని పొందగా, ఇందులో ఒకటి సెంటర్ కన్సోల్ పైన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఫీచర్ గా అందించబడింది.
థర్డ్ స్క్రీన్ పై చూపించే సమాచారానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికైతే తెలియవు. మహీంద్రా నుంచి రెండవ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీగా అందించబడుతున్న కారు సెంటర్లో రెడ్ ఇన్సర్ట్ తో కొత్త టూ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు ‘BE’ బ్రాండింగ్ తో బ్లాక్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్