- పెట్రోల్ టైప్ లో రానున్న MX ఎటి ఎంట్రీ-లెవెల్ ఆటోమేటిక్ వేరియంట్
- దీని ధర రూ. 16 లక్షలలోపు ఉండే అవకాశం
మహీంద్రా కంపెనీ మోస్ట్ పాపులర్ ఎస్‍యూవీ యొక్క వేరియంట్ లిస్టును ఎప్పటికప్పుడు మారుస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ మోడల్ త్వరలోనే పెట్రోల్ టైప్ లో ఎంట్రీ-లెవెల్ ఆటోమేటిక్ వేరియంట్ అయిన MX వేరియంట్ ని పొందనుంది. ప్రస్తుతం ఇది MX, AX3, AX5, AX7, మరియు AX7L అనే 5 వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందించబడుతుంది.
ధర అంచనా:
ప్రస్తుతం MX వేరియంట్ కేవలం మాన్యువల్ గేర్ బాక్సుతో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో అందించబడింది. ఇది 14 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇక రాబోయే MX AT పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే, మాన్యువల్ వేరియంట్ కంటే దీని ధర రూ.1.50 లక్షల నుండి రూ.1.80 లక్షలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము.
ఫీచర్స్:
ఫీచర్స్ గురించి చెప్పాలంటే, బేస్-స్పెక్ MX వేరియంట్లో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 7-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మొత్తం నాలుగు పవర్ విండోలు, పవర్డ్ ఓఆర్‌విఎం మరియు డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్ల కోసం ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లతో రానుంది.
పవర్ ట్రెయిన్:
మెకానికల్ గా, మహీంద్రా XUV700 యొక్క 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 197bhp పవర్ మరియు 380Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త వేరియంట్ యొక్క పవర్ అవుట్ పుట్ మరియు మైలేజీ AX పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లలో ఉన్నట్లుగానే ఇందులో కూడా ఉండే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్