- లేటెస్టుగా టాప్-స్పెక్ XUV700 ధరలను తగ్గించిన మహీంద్రా
- రూ.13.99 లక్షలతో XUV700 రేంజ్ ధరలు ప్రారంభం
గత నెలలో, మహీంద్రా కంపెనీ సుమారుగా రూ.2.2 లక్షల వరకు XUV700ఎస్‍యూవీ ధరలను తగ్గించింది. తగ్గిన ధరలు XUV700లోని టాప్-స్పెక్ AX7 మరియు AX7L వేరియంట్లపై వర్తిస్తాయి. ఇప్పుడు ఈ ఇండియన్ కార్ మేకర్ మరికొన్ని వేరియంట్ల ధరలను కూడా తగ్గించగా, తక్షణమే అమలులోకి వచ్చాయి.
మహీంద్రా XUV700 కారులోని AX5 డీజిల్ ఎటి 7-సీటర్ వేరియంట్ పై అత్యధికంగా రూ.70 వేల వరకు ధర తగ్గడంతో, దీని కొత్త ధర రూ.20.39 లక్షలు ఉంది. అదే విధంగా, AX5 పెట్రోల్ ఎంటి 7-సీటర్,ఈఎస్‍పీతో AX5 పెట్రోల్ ఎంటి 7-సీటర్ మరియు AX5 డీజిల్ ఎంటి 7-సీటర్ వేరియంట్లపై ఒకే విధంగా ధర రూ.50 వేలు తగ్గింది.
అదనంగా, XUV700 మోడల్ రేంజ్ లో ఉన్న AX3 డీజిల్ ఎటి 7-సీటర్ మరియు AX5 డీజిల్ ఎటి 5-సీటర్ వేరియంట్లు ఒక్కోదానిపై రూ.20 వేలు ధర తగ్గింది. XUV700 రేంజ్ ఎక్స్-షోరూం ధర ప్రస్తుతం రూ. 13.99 లక్షల నుంచి రూ.26.04 లక్షల మధ్య ఉంది. XUV700 ఎలక్ట్రిక్ వెర్షన్ రానుండగా, ఇది XUV.e8 ఎలక్ట్రిక్ కారుగా పిలువబడుతుంది. ఇది ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయబడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్