- మరింత చవకగా లభిస్తున్న 7-సీటర్ వేరియంట్
- AX3 వేరియంట్ కంటే దీని ధర రూ. 3 లక్షలు తక్కువ
మహీంద్రా కంపెనీ 7-సీట్ లేఅవుట్ ని లోయర్ వెర్షన్లకు కూడా విస్తరిస్తూ, ఇప్పుడు బేస్ MX వేరియంట్ ని రూ. 15 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. XUV700లో ఉన్న AX3 వేరియంట్ కంటే దీని ధర రూ.3 లక్షలు తక్కువ ఉండగా, మహీంద్రా ఈ వేరియంట్ ని కేవలం డీజిల్ ఇంజిన్ తో మాత్రమే అందించింది.
ఇంతకు ముందు, MX వేరియంట్ రూ. 14.60 లక్షల ఎక్స్-షోరూం ధరతో 5-సీటర్ లో అందుబాటులో ఉండేది. మహీంద్రా కంపెనీ ఇందులో మరిన్ని సీట్లను అందుబాటులోకి తీసుకువచ్చి కస్టమర్లు దృష్టిని ఆకర్షించి, కస్టమర్లు ఈ మూడు-వరుసల ఎస్‍యూవీని ఎంచుకునే విధంగా డిజైన్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది.
XUV700MX వేరియంట్లో 7-ఇంచ్ ఎంఐడి డిస్ ప్లే, 8-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, రియర్ ఏసీ వెంట్స్, మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‍విఎం వంటి ఫీచర్లు ఉన్నాయి.
XUV700 మోడల్ లోని 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ జతచేయబడి 153bhp మరియు 360Nmటార్కును ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది.
అంతే కాకుండా, ఇప్పుడు XUV700 కొత్త బ్లేజ్ ఎడిషన్ లో కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.25,000 ఎక్కువగా ఉండగా, ఇది టాప్-స్పెక్ AX7L వేరియంట్ ఆధారంగా వచ్చింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్