- రెండు లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని సాధించిన XUV700
- ఇప్పుడు 9 కలర్స్ లోఅందించబడుతున్న XUV700
XUV700 రెండు లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని సాధించిన సందర్భంగా వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి, ఆటోమేకర్ దాని ఫ్లాగ్‌షిప్ ఎస్‌యువిలో కొత్త ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. XUV700 ఇప్పుడు, డీప్ ఫారెస్ట్ మరియు బర్న్ట్ సియన్నా అనే రెండు న్యూ కలర్స్ లో లభిస్తుంది. అలాగే, డీప్ ఫారెస్ట్ కలర్ ఒక్కటే కాకుండా, రెండోది బర్న్ట్ సియన్నా కలర్ XUV700కి మాత్రమే రిజర్వ్ చేయబడగా, ఇలాంటి ప్రత్యేకత ఏ ఇతర మోడల్స్ లో అందించబడలేదు.
దీనితో, మహీంద్రా XUV700 మిడ్‌నైట్ బ్లాక్, ఎవరెస్ట్ వైట్, డాజ్లింగ్ సిల్వర్, రెడ్ రేజ్, ఎలక్ట్రిక్ బ్లూ, నపోలి బ్లాక్, మ్యాట్ బ్లేజ్ రెడ్, డీప్ ఫారెస్ట్ (కొత్తది), మరియు బర్న్ట్ సియెన్నా (కొత్తది) వంటి 9 ఎక్స్‌టీరియర్ కలర్స్ లో లభిస్తుంది.
ఇటీవల, ఆటోమేకర్ XUV700లో AX5 సెలెక్ట్ మరియు న్యూ ఎంట్రీ-లెవల్ సెవెన్-సీటర్ MX వేరియంట్ అనే రెండు కొత్త వేరియంట్‌లను పరిచయం చేసింది. అంతేకాకుండా, MX వేరియంట్ త్వరలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పొందడానికి సిద్ధంగా ఉంది, ప్రస్తుతం ఇది పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్‌లలో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప