- రీడిజైన్ చేయబడిన కొత్త హెడ్‌ల్యాంప్స్ తో పొందనున్న ఫాసియా
- ఈ ఏడాది చివర్లో అరంగేట్రం అయ్యే అవకాశం
మహీంద్రా XUV400 ఫేస్‌లిఫ్ట్, XUV300 ఫేస్‌లిఫ్ట్, XUV700 ఈవీ మరియు ఫైవ్ -డోర్ థార్ తో సహా పలు మోడళ్లను కూడా టెస్టింగ్ చేస్తుంది. లాంచ్ కానున్న మోడళ్లలో, XUV700 ఈవీ లేదా XUV.e8 ఇటీవలే టెస్ట్ రన్ లో కనిపించాయి, రాబోయే (అప్‍కమింగ్)టాటాహారియర్ ఈవీకి పోటీగా ఉండే ఈ మోడల్ వివరాలను మహీంద్రా వెల్లడించింది.
ఇక్కడ చిత్రంలో చూసినట్లుగా, XUV.e8 పూర్తి-వెడల్పు లైట్ బార్‌ను పొందుతుంది, ఇది బ్లాంక్డ్-ఆఫ్గ్రిల్, వీడర్ ఏయిర్ ఇన్ లెట్‌లతో- రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ మరియు క్యూబికల్ షేప్డ్ తో పూర్తిగా కొత్త రూపాన్ని పొందిన హెడ్‌ల్యాంప్ యూనిట్ తో ఉంటుంది. అంతేకాకుండా, ఇది స్టాండర్డ్ XUV700 నుండి వేరుగా కనిపించడానికి ఏరో-ఇంస్పైర్డ్ అల్లాయ్ వీల్స్‌ను కూడా పొందుతుంది. అంతేకాకుండా, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్‌తో ఎస్‌యువి సైడ్ ప్రొఫైల్ లో కొద్దిగా మార్పులు ఉండవచ్చు.
అదేవిధంగా, వెనుక ప్రొఫైల్ కూడా ఐసిఈ వెర్షన్ తో పోలిస్తే కనీసం మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇది హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ మరియు ట్వీక్డ్ రియర్ బంపర్‌తో పొడిగించిన రూఫ్ స్పాయిలర్‌ను కలిగి ఉంటుంది.
లోపలి భాగంలో, మునుపటి స్పైషాట్‌లు చూసినట్లుగా, ఎలక్ట్రిఫైడ్ XUV700 క్యాబిన్ భారీగా కొత్త రూపాన్ని పొందింది. న్యూ ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, కొత్త యూఐతో ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, న్యూ గేర్సె లెక్టర్ లీవర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు కో-డ్రైవర్ కోసం మూడవ స్క్రీన్ వంటి ఫీచర్స్ అప్‌గ్రేడ్‌లో భాగంగా ఉంటాయి.
రాబోయే (అప్‍కమింగ్) మహీంద్రా XUV.e8 ఫ్రంట్-యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు 80kWh బ్యాటరీ ప్యాక్ ని పొందుతుంది. కొలతల విషయానికొస్తే, ఈ మోడల్ 4,740ఎంఎం పొడవు మరియు 2,762ఎంఎం వీల్‌బేస్ కలిగి ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప