- 5,008 యూనిట్ల XUV700 కార్లను విక్రయించిన మహీంద్రా
- లేటెస్టుగా బ్లేజ్ ఎడిషన్ ని అందుకున్న XUV700 మోడల్
మహీంద్రా కంపెనీ లేటెస్టుగా మే-2024కి సంబంధించి దాని సేల్స్ నంబర్లను వెల్లడించింది. ఇది వరకే మేము మీకు మహీంద్రా థార్ సేల్స్ నంబర్లను మా వెబ్ సైట్ ద్వారా వెల్లడించాము. ఈసారి మేము మే నెలలో మహీంద్రా కంపెనీ XUV700 మోడల్ కి సంబంధించి ఎన్ని యూనిట్లను విక్రయించిందో మీకు తెలియజేయబోతున్నాము.
మే-2024లో, మహీంద్రా 5,008 యూనిట్ల XUV700 కార్లను విక్రయించింది. ఇందులో 3,845 యూనిట్ల డీజిల్ వేరియంట్ కార్లను విక్రయించగా, 1,163 యూనిట్ల పెట్రోల్ వేరియంట్ కార్లను విక్రయించింది. ఇక సేల్స్ పరంగా పర్సంటేజీ విషయానికి వస్తే, ఇందులో 77 శాతం డీజిల్ వేరియంట్లు విక్రయించబడ్డాయి. సరిగ్గా గత ఏడాది ఇదే సమయానికి, మహీంద్రా 3,739 యూనిట్ల XUV700డీజిల్ కార్లను మరియు 1,506యూనిట్ల XUV700పెట్రోల్ కార్లను విక్రయించింది.
XUV700ప్రొడక్షన్ నంబర్స్ విషయానికి వస్తే, మహీంద్రా 3,675 యూనిట్ల డీజిల్ కార్లను చేయగా, 1,732 యూనిట్ల పెట్రోల్ కార్లను మానుఫాక్చరింగ్ చేసింది.ప్రస్తుత నంబర్లను గత ఏడాది మే-2023తో పోలిస్తే కొద్దిగా మార్పు కనిపించింది. మే-2023లో మహీంద్రా కంపెనీ 1,570 యూనిట్ల పెట్రోల్ కార్లను మరియు 3,708 యూనిట్ల డీజిల్ కార్లను తయారుచేసింది.
ఇతర వార్తలలో చూస్తే, మహీంద్రా కంపెనీ ఈ మధ్యనే అనగా గత నెలలో XUV700 మోడల్ లో బ్లేజ్ ఎడిషన్ ని పరిచయం చేయగా, అది మ్యాట్ రెడ్ కలర్ ని పొందింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ ఎస్‍యూవీలోని MX వేరియంట్ అధారంగా ఒక కొత్త ఆటోమేటిక్ వేరియంట్ ని తీసుకురావడానికి కృషి చేస్తుంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు మా వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్