- 33 నెలల్లో ల్యాండ్ మార్కును చేరుకున్న XUV700
- లేటెస్టుగా రెండు కొత్త కలర్లను పొందిన మహీంద్రా మోడల్
మహీంద్రా కంపెనీ రెండు లక్షల XUV700 కార్లను ఉత్పత్తి చేసి ఇండియాలో కొత్త మైల్‍స్టోన్ ని క్రియేట్ చేసింది. ఈ ఎస్‍యూవీ ఒక లక్ష కార్ల ఉత్పత్తి ద్వారా ఈ ల్యాండ్ మార్కును అధిగమించడానికి 21 నెలలు పట్టగా, రెండు లక్షల యూనిట్ల ప్రొడక్షన్ మైల్‍స్టోన్ చేరుకోవడానికి 33 నెలల సమయం పట్టింది.
ఇంకా చెప్పాలంటే, ఈ మైల్‍స్టోన్ ని మరింత ఘనంగా సెలెబ్రేట్ చేయడానికి ఇండియన్ ఆటోమేకర్ మహీంద్రా XUV700లో డీప్ ఫారెస్ట్ మరియు బర్న్ట్ సియెన్నా అనే రెండు కొత్త కలర్లను తీసుకువచ్చింది. మొదటి డీప్ ఫారెస్ట్ కలర్ ఇతర మహీంద్రా ఎస్‍యూవీలలో మనం చూడగా, బర్న్ట్ సియెన్నా కలర్ ఎక్స్‌క్లూజివ్ గా XUV700లో మాత్రమే లభిస్తుంది.
XUV700ని MX, AX3, AX5, AX5 సెలెక్ట్, AX7, AX7 లగ్జరీ, మరియు AX7 లగ్జరీ బ్లేజ్ ఎడిషన్ అనే ఏడు వేరియంట్లలో పొందవచ్చు. మెకానికల్ గా, XUV700 మోడల్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో వచ్చింది. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 197bhp మరియు 380Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 182bhp మరియు 450Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల పరంగా, ఈ రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, XUV700 టాప్-స్పెక్ డీజిల్ వేరియంట్లు ఏడబ్లూడీ సిస్టం ఆప్షన్ ని కూడా పొందాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్