- నెలవారీగా తగ్గుతూ వస్తున్న ఎక్స్‌యూవీ700 పెండింగ్ ఆర్డర్లు
- 2.86 లక్షలు దాటిన మొత్తం మహీంద్రా ఓపెన్ బుకింగ్స్
నవంబర్-2023 నాటికి ప్రొడక్షన్ రేంజ్ లో ఎన్ని ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయో మహీంద్రా ఇటీవలే వెల్లడించింది. ఈ కార్‌మేకర్ ఇంకా దాదాపు 2.86 లక్షలకు పైగా వెహికిల్స్ డెలివరీ చేయాల్సి ఉండగా, అందులో పెద్ద మొత్తంలో ఎక్స్‌యూవీ700 ఆర్డర్స్ ఉన్నాయి.
ఇప్పటికీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 70వేల బుకింగ్స్ కలిగి ఉండగా, వీటిని దేశవ్యాప్తంగా ఉన్న ఆ వాహనాలకు ఓనర్లుగా ఉన్న వారికి డెలివరీ చేయాల్సి ఉంది. అదే విధంగా, ఈ మోడల్ ప్రతి నెలా యావరేజ్ గా 9,000 బుకింగ్స్ అందుకుంటుంది, అయితే ప్రతి నెలా వచ్చిన కొత్త బుకింగ్స్ అన్నీ కలిపితే మొత్తం బుకింగ్స్ 51,000 యూనిట్లకు చేరుకున్నాయి. కేవలం మీ రిఫరెన్స్ కోసం చెబుతున్నాం, ఇదే ఎక్స్‌యూవీ700 ఈ ఏడాది మేలో 78,000 యూనిట్స్ ఓపెన్ బుకింగ్స్ అందుకుంది.
ఇప్పటికీ ఎక్స్‌యూవీ700 కోసం ఆర్డర్స్ సంఖ్య పెరుగుతూనే ఉన్నప్పటికీ, ఆటో మార్కెట్ లో ఈ మోడల్ కు అధిక డిమాండ్ కొనసాగుతూనే ఉంది. దాని ఫలితంగా, వెయిటింగ్ పీరియడ్ కూడా మరింత ఎక్కువగా ఉండనుంది. నవంబర్ నాటికి, ఎక్స్‌యూవీ700ని బుక్ చేసుకునే కస్టమర్స్ సుమారుగా 6 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్