- అందుబాటులో ఉన్న 2 వేరియంట్స్
- ప్రస్తుత ధర రూ. 16 లక్షలు (ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర)
మహీంద్రా ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి ఎక్స్‌యువి400ని ప్రారంభ ధర రూ. 15.99 లక్షలుతో (ఎక్స్-షోరూమ్) లాంచ్ చేసింది. టాటా నెక్సాన్ ఈవీతో పోటీ పడుతున్నఇది రెండు వేరియంట్లలో మరియు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇంతకు ముందు దీన్ని ప్రారంభించినప్పుడు, ఆల్-ఎలక్ట్రిక్ మహీంద్రా ఎస్‌యువిలో కొన్ని కీలకమైన ఫీచర్లు లేవు. తర్వాత, ఆగస్ట్‌లో, ఈఆటోమేకర్ ప్యాకేజీ అప్‌గ్రేడ్ లో భాగంగా టిపిఎంఎస్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎంతో సహా 8 కొత్త ఫీచర్లను పరిచయం చేసింది.
దీనిని ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉన్న, నెక్సాన్ ఈవీతో పోల్చినప్పుడు, ఎక్స్‌యువి400 లోపలి భాగం కొంచెం పాతదిగా అనిపిస్తుంది. అయితే, ఎలక్ట్రిక్ ఎక్స్‌యువి400లో మునుపటికంటే కొత్త ఇంటీరియర్స్ అప్‌డేట్ తో రాబోతోందని ఈ బ్రాండ్ ఇటీవల తెలిపింది. ఈ మోడల్ ఇంటీరియర్ థీమ్ మరియు లేఅవుట్‌ను రాబోయే ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ నుండి తీసుకొని పూర్తిగా కొత్త డ్యాష్‌బోర్డ్‌తో రానుంది.
ఎక్స్‌యువి400లో పెద్ద ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్వీక్ చేయబడిన హెచ్ విఏసి ప్యానెల్ మరియు ఎయిర్‌కాన్ వెంట్‌లను పొందుతుందని మేము ఆశిస్తున్నాము. ఫీచర్ల విషయానికొస్తే, ఈ మోడల్ లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, యాంబియంట్ లైటింగ్ మరియు ప్రీమియం సౌండ్ సిస్టమ్ లాంటి బెనిఫిట్స్ ఇందులో ఉండనున్నాయి.
టెక్నికల్ మరియు స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, మహీంద్రా ఎక్స్‌యువి400 ఇంతకు ముందున్న 34.5kWh మరియు 39.4kWh యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో ఒకే మోటార్ సెటప్ తో కొనసాగనుంది. మొదటిది క్లెయిమ్డ్ 375కిమీ రేంజ్ ని అందించనుండగా, రెండోది పూర్తి ఛార్జ్‌పై 456కిమీల డ్రైవింగ్ రేంజ్ ని అందించగలదు.
అనువాదించిన వారు: రాజపుష్ప