- డ్యూయల్ 10.25-ఇంచ్ స్క్రీన్స్ పొందనున్న ఎక్స్‌యువి400
- మెకానికల్‍గా ఎటువంటి మార్పు లేకుండా వచ్చే అవకాశం
మహీంద్రా తన ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యువి, ఎక్స్‌యువి400 అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇండియాలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో కొత్త అప్‌డేట్‌తో, ఎలక్ట్రిక్ మోడల్‌లో EC ప్రో మరియు EL ప్రో అనే రెండు కొత్త వేరియంట్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆటోమేకర్ 2024 ప్రారంభంలో ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్‌తో పాటు అప్‌డేటెడ్ ఎక్స్‌యువి400ని కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.
మార్పుల విషయానికొస్తే, EC ప్రో వేరియంట్ పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, కీలెస్ ఎంట్రీ, రియర్ యూఎస్‍బి, రియర్వెనుక ఏసీ వెంట్స్ , ఓసిపిఐ హబ్ ఇంటిగ్రేషన్ మరియు రెండు యూఎస్‍బి ఛార్జింగ్ పోర్ట్‌లు వంటి ఫీచర్స్ పొందింది. మరోవైపు, టాప్- స్పెక్ EL ప్రో వేరియంట్‌లో క్రూయిజ్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్, 6 స్పీకర్లు మరియు ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం డ్యూయల్ 10.25-ఇంచ్ స్క్రీన్ లభ్యం అవుతుంది. అంతే కాకుండా ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, రీడిజైన్ చేసిన డాష్‌బోర్డ్ లేఅవుట్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు కొత్త స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఎక్స్‌యువి400లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి – అవి, 34.5kWh మరియు 39.4kWh యూనిట్. మొదటిది ఒక్క ఫుల్ చార్జ్ తో 375కి.మీ. డ్రైవింగ్ రేంజ్ ని అందించనుంది. మరోవైపు, రెండోది ఒకే ఛార్జ్‌పై 456కి.మీ.ల డ్రైవింగ్ రేంజ్ ని అందించనుంది
లాంచ్ తర్వాత, అప్‌డేట్ ఎక్స్‌యువి400 టాటా నెక్సాన్ ఈవీ, ఎంజి ZS ఈవీ మరియు హ్యుందాయ్ కోనా ఈవీలకు పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప