రెండు వేరియంట్లలో లభ్యం
రివైజ్డ్ ఇంటీరియర్స్ మరియు కొత్త ఫీచర్లతో వచ్చిన XUV400 ప్రో
ఆటో దిగ్గజం మహీంద్రా XUV400 యొక్క అప్‍డేటెడ్ వెర్షన్ XUV400 ప్రోను రూ.15.49 లక్షల ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 15.49 లక్షలు(ఎక్స్-షోరూం)తో బేస్ వేరియంట్ తో కలిపి టాప్ స్పెక్ వేరియంట్ రూ.17.49 లక్షలు(ఎక్స్-షోరూం) వరకు ఉన్నాయి. మొత్తానికి ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ లేటెస్ట్ ఫీచర్స్ మరియు టెక్ అప్‍డేట్స్ తో సెగ్మెంట్ లీడర్ గా ఉన్న టాటా నెక్సాన్ ఈవీతో పోటీపడుతుంది.
కొత్త XUV400 ప్రో మోడల్ EC ప్రో మరియు EL ప్రో అనే రెండు వేరియంట్లలో అందించబడుతుంది. ఇందులోని మార్పుల విషయానికి వస్తే, కొత్త వెర్షన్స్ యొక్క క్యాబిన్ రీడిజైన్డ్ బ్లాక్ మరియు గ్రే ట్రీట్ మెంట్ ను అందుకుంది. దీంతో XUV400 ప్రో లుక్ మరింత్ స్టైలిష్ గా కనిపించనుంది.
కొత్త ఫీచర్స్ విషయానికి వస్తే, టాప్-స్పెక్ EL ప్రో వేరియంట్లో ఫ్లోటింగ్ 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రివైజ్డ్ ఎయిర్‌కాన్ ప్యానెల్, రియర్ టైప్-సి యుఎస్‍బి పోర్ట్, రియర్ మొబైల్ హోల్డర్, కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు అడ్రినోఎక్స్ కనెక్టెడ్ కార్ టెక్ వంటి ఫీచర్స్ తో రానుంది.
XUV400 ప్రో మోడల్ 34.5kWh మరియు 39.4kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్స్ తో వచ్చింది. సింగిల్ ఛార్జ్ తో 34.5kWh బ్యాటరీ ప్యాక్ 375 కి.మీ. క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ అందిస్తుండగా, 39.4kWh బ్యాటరీ ప్యాక్ 456 కి.మీ. క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్