- ఇండియాలో రూ.15.49 లక్షలతో లాంచ్ అయిన మహీంద్రా XUV400
- 6 ఎయిర్ బ్యాగ్స్ తో అందుబాటులో ఉన్న EL ప్రో వేరియంట్
ఇండియాలో మహీంద్రా XUV400 ప్రోను రూ.15.49 లక్షలు(ఎక్స్-షోరూం) ధరతో లాంచ్ చేసింది. ఇంతకు ముందు XUV400 లైనప్ లో మిస్సయిన ఫీచర్లను XUV400 ప్రోలో మహీంద్రా EC ప్రోమరియు EL ప్రో అనే రెండు వేరియంట్ల ద్వారా మహీంద్రా కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
EC ప్రో వేరియంట్లో కేవలం చిన్న 34.5kWh బ్యాటరీ ప్యాక్ మాత్రమే అందుబాటులో ఉండగా,ELప్రో వేరియంట్లో 34.5kWh మరియు 39.4kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. అవుట్ పుట్ పరంగా చూస్తే ప్రో మోడల్ ఏమాత్రం మార్పు లేకుండా 148bhp పవర్మరియు 310Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా డ్రైవింగ్ రేంజ్ పరంగా EC వెర్షన్ 375 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుండగా, EL వెర్షన్ 456 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్(ఎంఐడిసి ఇండియన్ డ్రైవింగ్ స్టాండర్డ్స్ ప్రకారం)ని అందిస్తుంది.
ఒకవేళ మీరు EC ప్రో వేరియంట్ ని సెలెక్ట్ చేసుకుంటే, XUV400 ప్రోలో ఈ క్రింది ఫీచర్స్ మీరు పొండుతారు.
- పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ మరియు కీలెస్ ఎంట్రీ - రియర్ ఏసీ వెంట్స్ మరియు యూఎస్‍బీ - ఓసీపీఐ (ఓపెన్ ఛార్జ్ పాయింట్ ఇంటర్‌ఫేస్) హబ్ ఇంటిగ్రేషన్ - రియర్ డిస్క్ బ్రేక్స్ - కవర్‌తో 16-ఇంచ్ స్టీల్ వీల్స్ - సీట్ బెల్ట్ హైట్ అడ్జస్టబుల్ - 2 ఎయిర్‌బ్యాగ్స్ - ఐసోఫిక్స్/చైల్డ్ యాంకర్స్ - 60:40 స్ప్లిట్ చేయబడిన రెండవ వరుస సీట్లు - ఫాబ్రిక్ సీట్లు - ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్స్ - ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ - 8.89సెంటిమీటర్ల ఎంఐడి స్క్రీన్‌తో కొత్త క్లస్టర్ - ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎం - ఒక టచ్-డౌన్ డ్రైవర్ విండో - డ్రైవ్ మోడ్స్ - కనెక్టెడ్ కార్ టెక్ - 60:40 స్ప్లిట్ సీట్లు - ఈఎస్‍పీ - టిపిఎంఎస్ |
EC ప్రో కంటే, EL ప్రో మోడల్ లో మీరు ఈ కింది ఫీచర్లను అదనంగా పొందుతారు.
- అలెక్సాతో 26.04సెం.మీ. (10.25-ఇంచ్) టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ - 26.04 సెం.మీ. (10.25-ఇంచ్) ఎంఐడి - వైర్‌లెస్ ఛార్జర్ - షార్క్ ఫిన్ యాంటెన్నా - క్రూయిజ్ కంట్రోల్ - ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం - ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ - 6 స్పీకర్స్ - 16-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ - ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ఓఆర్‌విఎం - రూఫ్ రెయిల్స్ - ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ - 6 ఎయిర్‌బ్యాగ్స్ - రియర్ డీఫాగర్ మరియు వైపర్ - లెదరెట్ సీట్లు మరియు స్టీరింగ్ వీల్ - యాంటీ-పించ్‌తో కూడిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ - స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ - హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు - కప్ హోల్డర్‌లతో రెండవ వరుస ఆర్మ్‌రెస్ట్ - గ్లోవ్ బాక్స్ ఇల్యూమినేషన్ - స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ - అడాప్టివ్ గైడ్ లైన్స్ తో రివర్స్ కెమెరా - రెయిన్ సెన్సింగ్ వైపర్స్ - ఆటో హెడ్‌ల్యాంప్స్ |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్