- అందుబాటులో ఉన్న EC మరియు EL వేరియంట్స్
- త్వరలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్‌ను పొందనున్న ఎక్స్‌యువి400 ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా ఎక్స్‌యువి400 ఈ సంవత్సరం ప్రారంభంలో బ్రాండ్ యొక్కఎలక్ట్రిక్ వెహికిల్ జర్నీని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ ఎస్‌యువి 148bhp మరియు 310Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో కూడిన 39.4kWh బ్యాటరీ ప్యాక్ తో అందించబడుతుంది.
ఎక్స్‌యువి400 మైలేజ్: క్లెయిమ్డ్ వర్సెస్ టెస్ట్
మహీంద్రా ఎక్స్‌యువి400 యొక్క మైలేజీ ఒకే ఛార్జ్‌పై 456కిమీ (EL వేరియంట్) ఉన్నప్పటికీ, మేము దాని రేంజ్ ని రియల్ వరల్డ్ రేంజ్ లో కూడా టెస్ట్ చేశాము.
మహీంద్రా ఎక్స్‌యువి400 మైలేజ్ (ఒకే ఛార్జ్‌పై) | |
క్లెయిమ్డ్ మైలేజ్ | రియల్- వరల్డ్ మైలేజ్ |
456కి.మీ. | 282కి.మీ. |
మహీంద్రా ఎక్స్‌యువి400 EVలో ఉన్న 8 కొత్త ఫీచర్స్
ఆగస్ట్ 2023లో, ఈ మహీంద్రా EV తన ఎక్స్-షోరూమ్ ధరలలో ఎటువంటి మార్పులు లేకుండానే 8 కొత్త ఫీచర్ల నుండి ప్రయోజనం పొందింది. ఇక్కడ వివరాలు లిస్ట్ చేయబడ్డాయి.
ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం
టైర్ ప్రెజర్ మానిటర్
ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
బూట్ ల్యాంప్
6-స్పీకర్ సౌండ్ సిస్టమ్
క్రూయిజ్ కంట్రోల్
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఎఎస్‍పి)
హిల్-స్టార్ట్ అసిస్ట్ (హెచ్ఎస్ఏ)
ఎక్స్‌యువి400 ఫేస్‌లిఫ్ట్ వర్క్స్
అదే విధంగా, మహీంద్రా ఎక్స్‌యువి400 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై కూడా మహీంద్రా తన పనిని కొనసాగిస్తుంది. ఇది అనేక సందర్భాల్లో టెస్టింగ్ చేస్తూ మనకు కనిపించింది, ఈ అప్‌డేటెడ్ మోడల్ పెద్ద 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజైన్ చేయబడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు మరిన్ని ఫీచర్లను పొందే అవకాశం ఉంది. ఇది 2025 ప్రారంభంలో ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టబడుతుందని మేము భావిస్తున్నాము.
అనువాదించిన వారు: రాజపుష్ప