- ఇండియాలో రూ.16 లక్షలు (ఎక్స్-షోరూం)తో ప్రారంభంకానున్న ధరలు
- రూ.4 లక్షల భారీ డిస్కౌంట్ ని అందుకుంటున్న మహీంద్రా ఎక్స్‌యూవీ400
ఇండియన్ ఆటో ఇండస్ట్రీ రారాజుగా ఉన్న మహీంద్రా కంపెనీ ఇండియాలో విక్రయించబడుతున్న దాని ఏకైక ఎలక్ట్రిక్ మోడల్ ఎక్స్‌యూవీ400పై భారీగా రూ.4 లక్షలు వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రూ.16 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో, EC మరియు EL అనే 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
కస్టమర్స్ ఎవరైతే ఎక్స్‌యూవీ400ని కొనుగోలు చేయాలని భావిస్తున్నారో వారికి EC మరియు EL అనే 2 వేరియంట్లపై వరుసగా సుమారు రూ.3 లక్షల వరకు మరియు రూ. 4 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. ఇక్కడ పేర్కొన్న ఈ డిస్కౌంట్స్ మరియు అమౌంట్ వేరియంట్, డీలర్షిప్స్ మరియు అందుబాటులో ఉన్న స్టాక్ ను బట్టి మారవచ్చు. అంతేకాకుండా, ఈ బెనిఫిట్స్ 31 డిసెంబర్ 2023 వరకు మాత్రమే అమలులో ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్న డీలర్స్ ని సంప్రదించగలరు.
ఎక్స్‌యూవీ400 పవర్డ్ 34.5kWh యూనిట్ మరియు 39.4kWh యూనిట్ అనే 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ నుండి ఎలక్ట్రిక్ మోటారుకు పవర్ ని సప్లై చేస్తుంది. 39.4kWh యూనిట్ పూర్తి ఛార్జ్‌పై 456 కి.మీ. క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని ఇస్తుంది. 34.5kWh యూనిట్ చిన్న బ్యాటరీ ప్యాక్ కాబట్టి 375 కి.మీ. మైలేజీని మాత్రమే ఇస్తుంది. ఎక్స్‌యూవీ400పై మేము నిర్వహించిన టెస్టులలో 39.4kWh వెర్షన్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ చార్జ్ పై 282 కి.మీ. రియల్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ ని మాత్రమే అందించగలిగింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్