- మొదటిసారిగా 3XOను టీజ్ చేసిన మహీంద్రా
- కొత్త పేర్లను పొందనున్న XUV రేంజ్ మోడల్స్
ఏప్రిల్-2024లో దానిని ఆవిష్కరించే ముందు, మొదటిసారిగా మహీంద్రా XUV300 ఫేస్‍లిఫ్ట్ ని టీజ్ చేసింది. ఈ ఇండియన్ ఎస్‍యూవీ మేకర్ అప్‍డేటెడ్ సబ్-4-మీటర్ ఎస్‍యూవీని మహీంద్రా XUV 3XOగా పేరును మార్చగా, దానికి కొనసాగింపుగా XUV రేంజ్ మోడల్స్ పేర్లను సైతం మహీంద్రా మార్చనుందని మేము భావిస్తున్నాము, అందులో XUV700 మరియు ప్రస్తుతం విక్రయించబడుతున్న రాబోయే (అప్‍కమింగ్) XUV500 ఉన్నాయి.
కొత్త మహీంద్రా XUV 3XO టీజర్ ఫోటోలను చూస్తే, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ తో కొత్త ఫాసియా, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, సర్క్యులర్ ఫాగ్ లైట్స్, ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్,డైమండ్ ప్యాటర్న్ తో కొత్త గ్రిల్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు ఎల్లో పెయింట్ స్కీమ్ వంటి కీలక వివరాలను వెల్లడయ్యాయి. ఇంకా, ఇది కొత్త సి-షేప్డ్ ఎల్ఈడీటెయిల్‌లైట్స్, టెయిల్‌గేట్‌పై కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్, రియర్ వైపర్ మరియు వాషర్ మరియు కారు వెనుకవైపు ‘XUV 3XO’ లెటర్స్ ని పొందింది.
మహీంద్రా XUV 3XOగా పిలువబడుతున్న 2024 XUV300 ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 10.25-ఇంచ్ యూనిట్‌తో కొత్త ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. అలాగే, ఇది ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, ఫ్రెష్ అప్హోల్స్టరీ, ట్వీక్డ్ సెంటర్ కన్సోల్ మరియు కొత్త ఏసీ వెంట్స్ తో అందించబడే అవకాశం ఉంది.
రాబోయే (అప్‍కమింగ్)XUV 3XOలో అవే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లను 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్లతో జత చేయబడి రావచ్చని మేము భావిస్తున్నాం. లాంచ్ అయిన తర్వాత, కొత్త XUV 3XO మారుతి బ్రెజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, రెనాల్ట్ కైగర్, మరియు నిసాన్ మాగ్నైట్ వంటి మోడల్స్ తో పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్