- అద్బుతమైన బంపర్ డిజైన్ తో సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్
- భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ తో పూర్తి రివైజ్డ్ ఇంటీరియర్
మహీంద్రా XUV300ఫేస్‍లిఫ్ట్ అధికారిక రిలీజ్ కి ఎంతో దూరం లేదు, ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ మధ్య అప్‍డేటెడ్ XUV300 తాజా స్పై షాట్స్ విపరీతంగా పెరగడంతో పాటుగా మరియు ఇండియన్ యూవీ మేకర్ ఎలాంటి అధికారిక టీజర్ మరియు ప్రకటన వెలువడలేదు. బ్రాండ్ నుంచి స్పందన కోసం చూస్తుండగా, రాబోయే XUV300ఫేస్‍లిఫ్ట్ కి సంబంధించిన ప్రొడక్షన్-రెడీ అవతార్ స్పై ఫోటోలు ఆన్ లైన్లో హల్చల్ చేస్తున్నాయి.
గత స్పై షాట్స్ లాగా కాకుండా, ఈ కొత్త స్పై షాట్స్ లో ఎస్‍యూవీ హెడ్ ల్యాంప్స్, డీఆర్ఎల్స్, మరియు గ్రిల్ వంటి కొత్త అంశాలు వెల్లడయ్యాయి. అదే విధంగా స్ప్లిట్ హెడ్‌లైట్‌లతో కూడిన సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, మధ్యలో మహీంద్రా ట్విన్-పీక్ లోగోతో స్లీకర్ గ్రిల్ మరియు విశాలమైన రేడియేటర్ గ్రిల్‌తో అద్బుతంగా కనిపించే బంపర్ వంటి వాటిని పొందనుంది.
కారు వెనుక భాగం చూస్తే, కొత్త XUV300ట్రెండింగ్ లో ఉన్న కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్ సెటప్ తో రానుంది. ఇంకా చెప్పాలంటే, షార్ట్ టెయిల్ గేట్ ద్వారా కారు వెనుక ప్రొఫైల్ హైలైట్ చేయబడనుండగా, రిఫ్లెక్టర్లతో భారీ రీడిజైన్డ్ బంపర్, ఇంటిగ్రేటెడ్ హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ తో పొడవైన రూఫ్ స్పాయిలర్, రియర్ వైపర్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి వాటిని పొందనుంది.
ఇంటీరియర్ గురించి చెప్పాలంటే, XUV300 క్యాబిన్ అప్‍డేటెడ్ భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ మరియు హెచ్‍విఎసి ప్యానెల్, మరియు కొత్త ఇంటీరియర్ థీమ్ తో అప్‍డేటెడ్ సీట్ అప్హోల్స్టరీని అందుకోనుంది. అదే విధంగా, ఇందులో 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, మరియు ఏడీఏఎస్(ఎడాస్) వంటి ఫీచర్లు అందించబడనున్నాయి.
మెకానికల్ గా, అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రాబోయే XUV300లో ప్రస్తుత ఇటరేషన్లో ఉపయోగించిన పవర్ ట్రెయిన్ ఆప్షన్లనే మహీంద్రా ఇందులో కూడా కొనసాగించనుంది. XUV300ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ లాంచ్ అయిన తర్వాత, సెగ్మెంట్లో ఉన్న టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, రెనాల్ట్ కైగర్, నిసాన్ మాగ్నైట్, మారుతి సుజుకి బ్రెజా మరియు సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ వంటి కార్లకు పోటీగా కొనసాగనుంది.
చిత్రాలు: మోటార్‌బీమ్
అనువాదించిన వారు: సంజయ్ కుమార్