- కొత్త రియర్ బంపర్ తో రానున్న 2024ఎక్స్‌యూవీ300
- దాంతో పాటుగా తాజా ఎల్ఈడీ టెయిల్ లైట్స్ సెట్ రానున్న ఫేస్‍లిఫ్ట్
మహీంద్రా లాంచ్ కు ముందు ఫేస్‍లిఫ్టెడ్ ఎక్స్‌యూవీ300పై టెస్టింగ్ కొనసాగిస్తుంది, దీని లాంచ్ మరికొన్ని నెలలలో జరిగే అవకాశం ఉంది. కొత్త స్పై షాట్స్ చూస్తే టెస్ట్ మ్యూల్ తో ఉన్న ఈ మోడల్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తూ, ఎన్నో కొత్త వివరాలను మనకు అందిస్తుంది.
2024 మహీంద్రా ఎక్స్‌యూవీ300 టెస్ట్ మ్యూల్ యొక్క ఫోటోలలో చూస్తే, ఇది కొంతవరకు కామోఫ్లేజ్ తో కప్పబడి మరియు ప్రొడక్షన్-రెడీ అవతార్ లో ఉంది. ఇందులో మనకు కేవలం ఎల్-షేప్డ్ ఎల్ఈడీటర్న్ ఇండికేటర్స్ తో కూడిన కొత్త ఎల్ఈడీటైల్‌లైట్స్, హారిజాంటల్ గా పొజిషన్ లో ఉంచబడిన రిఫ్లెక్టర్స్ తో కూడిన కొత్త రియర్ బంపర్, ఇరువైపులా క్రోమ్ ఇన్‌సర్ట్‌లతో కూడిన రియర్ బంపర్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ రిసెస్ మరియు కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కనిపిస్తున్నాయి.
అలాగే అప్ డేటెడ్ ఎక్స్‌యూవీ300 రియర్ వైపర్ మరియు వాషర్ సెటప్ ని,హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రూఫ్ రెయిల్స్ మరియు సిగ్నల్స్ ని అందించడానికి యాంటెన్నాతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ని పొందనుంది. టెయిల్‌గేట్ ని చూస్తుంటే, దీన్ని కూడా రీవర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు మనం చూసిన స్పై షాట్స్ లో మోడల్ యొక్క కొత్త ఫాసియాను లీకయ్యాయి, దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే మీరు మా వెబ్‌సైట్‌ని సందర్శించి చదువుకోవచ్చు.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ లో కొత్త 10-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కొత్త గేర్ లీవర్‌తో సహా అప్ డేటెడ్ ఇంటీరియర్ కూడా ఉండనుంది. ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ గురించి చెప్పాలంటే, ప్రస్తుత ఇటరేషన్ కారు లాగే ఎలాంటి మార్పులు లేకుండా రానుంది. లాంచ్ అయిన తర్వాత, ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజా, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, టాటా నెక్సాన్ మరియు రెనాల్ట్ కైగర్‌లకు పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్