- ఇందులో అచ్చం ఎక్స్‌యువి700- లాగే ఉండనున్నడిఆర్ఎల్ఎస్
- కనెక్ట్ చేసిన రియర్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ తో వస్తున్నట్లు నిర్దారణ
మహీంద్రా తన రాబోయే ఎంట్రీ-లెవల్ ఎస్‌యువి, ఎక్స్‌యువి300 అప్‌డేటెడ్ వెర్షన్‌ను వివిధ సందర్భాల్లో పరీక్షించింది. ఇప్పుడు కొత్త స్పై పిక్చర్ లలో , టెస్ట్ మ్యూల్ ఎక్స్‌యువి300ని ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ లైట్స్ తో చూడవచ్చు.
మరొక స్పై పిక్చర్ ని చూస్తే, టెస్ట్ వెహికిల్ ఎక్స్‌యువి700- లాగే ఇన్వర్టెడ్-ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ మరియు సర్క్యులర్ హెడ్‌ల్యాంప్స్ తో అమర్చబడి ఉంటుంది. ఇతర ఎక్స్‌టీరియర్ లో ముఖ్యమైనవిగా పైకి లేచినట్లు ఉండే బానెట్, ట్వీక్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్, రివైజ్డ్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు కొత్త ప్యాటర్న్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
అదే విధంగా, వెనుక వైపుగా, ఎస్‌యువి ఇప్పుడు ఇన్వర్టెడ్ ఎల్- షేప్డ్ డిజైన్‌తో కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంది.ఇది రియర్ వైపర్, హై-మౌంట్ స్టాప్ ల్యాంప్ మరియు ఆసక్తికరంగా షార్క్-ఫిన్‌కు బదులుగా సాధారణమైన రేడియో యాంటెన్నాను మాత్రమే పొందుతుంది.
ఇంతకు ముందున్న స్పై పిక్చర్స్ లో చూస్తే, ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగం పెద్ద ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ట్వీక్డ్ డాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ మరియు కొత్త స్టీరింగ్ వీల్ వంటి కీలకమైన వివరాలను రివీల్ చేసింది.
మెకానికల్‍గా, ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ ను 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పొందవచ్చు.
అనువాదించిన వారు:రాజపుష్ప