- సరికొత్త ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్ ను పొందనున్న ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్
- ఇంటీరియర్స్ అప్‌డేట్ లను పొందనున్న ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా తన ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ ఎస్‌యువి, ఎక్స్‌యువి300 యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను టెస్టింగ్ చేస్తూ మళ్లీ కనిపించింది. టెస్ట్ మ్యూల్ తో భారీగా కప్పబడి ఉన్న ఈ మోడల్ ని స్పై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఇది వచ్చే మరికొన్ని నెలల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇక్కడ స్పై షాట్‌లో చూసినట్లుగా, ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ పూర్తిగా రీడిజైన్ చేయబడిన రియర్ ప్రొఫైల్‌ను పొందుతుంది. ఇది కనెక్ట్ చేసే లైట్ బార్, కొత్త బంపర్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో ఎక్స్‌టెండెడ్ రూఫ్ స్పాయిలర్, డీఫాగర్‌తో రియర్ వైపర్ మరియు రూఫ్ రెయిల్స్ తో కూడిన సి-షేప్డ్ ఎల్ఈడీ టైల్‌లైట్‌లను కలిగి ఉంటుంది.
ఈ ఎక్స్‌యువి300 క్యాబిన్ అతిపెద్ద మార్పును పొందనుండగా, ఇప్పుడు మాత్రం ఇది కొంచెం పాతదిగా అనిపిస్తుంది. అయితే, ఇటీవలే లాంచ్ అయిన ఎక్స్‌యువి400 లాగానే, ఇది ఇప్పుడు మోడరన్ అనుభూతిని అందించడానికి కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పొందుతుంది. ఈ ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, ఎయిర్‌కాన్ ప్యానెల్ మరియు అప్‌హోల్స్టరీతో లోడ్ చేయబడుతుందని మేము ఆశిస్తున్నాము.
మెకానికల్‍గా చూస్తే, ఎక్స్‌యువి300 ను అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అందించే అవకాశం ఉంది .ఇది ప్రస్తుతం 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో ఆరు-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్‌బాక్స్ ఆప్షన్స్ తో వచ్చింది.
అనువాదించిన వారు: రాజపుష్ప