- త్వరలో లాంచ్ కానున్న 2024 XUV300
- లాంచ్ సమయానికి ఏడీఏఎస్ (ఎడాస్)తో వచ్చే అవకాశం
మరికొన్ని వారాల్లో లాంచ్ జరగనుండగా, లాంచ్ కి ముందుగా, మహీంద్రా దాని ఫేస్‍లిఫ్టెడ్ XUV300ని దేశవ్యాప్తంగా టెస్టింగ్ చేస్తూనే కొనసాగిస్తుంది. తాజా స్పై షాట్స్ చూస్తే, అప్‍డేటెడ్ సబ్-4-మీటర్ ఎస్‍యూవీలోని ఆయా వేరియంట్లకు సంబంధించి వివిధ అంశాలు వెల్లడయ్యాయి.
ఇక్కడ ఫోటోలలో చూసినట్లుగా, ఈ మహీంద్రా XUV300 టెస్ట్ మ్యూల్ ఫేస్‍లిఫ్ట్ బేస్ వేరియంట్ గా అనిపిస్తుండగా, ఇది వీల్ కవర్లతో స్టీల్ వీల్స్ తో వెళ్తుండగా కనిపించింది. దాని తర్వాత మరొకటి బ్లాక్-కలర్డ్ యూనిట్ ని చూస్తే, ఇది స్టైల్డ్-వీల్ కవర్లతో స్టీల్ వీల్స్ ఫీచర్ తో కనిపించింది. ఈ ఫీచర్ కేవలం టాటా టియాగో మరియు రెనాల్ట్ ట్రైబర్ వంటి సెలెక్టెడ్ కార్లలో మాత్రమే అందించబడింది.
ఇంకా చెప్పాలంటే, మరో 2024 XUV300 టెస్ట్ మ్యూల్ డ్యూయల్-టోన్ వీల్స్ తో వెళ్తుండగా కనిపించింది, దీన్ని చూస్తుంటే, బహుశా టాప్-స్పెక్ వేరియంట్ గా మనం భావించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈ మూడు కార్లలో గమనించాల్సిన అంశాలు ఏవి అంటే, ఈ మూడు కార్లు ఓఆర్‌విఎం-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్స్ ని కలిగి ఉన్నాయి. అంటే వీటన్నింటిలో ఇది స్టాండర్డ్ గా అందించబడే అవకాశం ఉంది.
కొత్త మహీంద్రా XUV300 ఫేస్‍లిఫ్ట్స్ యొక్క సింగిల్ స్పై షాట్ ని గమనిస్తే, ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, చిన్న ఏసీ వెంట్స్ తో రివైజ్డ్ సెంటర్ కన్సోల్ మరియు మాన్యువల్ ఐఆర్‌విఎం వంటి ఫీచర్లు XUV300 ఫేస్‍లిఫ్ట్ ఇంటీరియర్ లో ఉండనున్నట్లు వెల్లడైంది. ట్వీక్డ్ డిజైన్ మరియు కొత్త ఫీచర్లతో పాటుగా, ఈ అప్‍డేటెడ్ XUV300 అవే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లను 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్లతో జత చేయబడి కొనసాగించే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్