- ప్రస్తుతం నిలిపివేయబడ్డ XUV300 బుకింగ్స్
- లాంచ్ సమయానికి ఫేస్‍లిఫ్ట్ మోడల్ ఏడీఏఎస్ (అడాస్) ఫీచర్లతో వచ్చే అవకాశం
మహీంద్రా XUV300 యొక్క మిడ్-లైఫ్ అప్‍డేట్ ని టెస్టింగ్ చేస్తూ ఉండగా, మరోసారి ఈ సబ్-4-మీటర్ ఎస్‍యూవీ యొక్క కీలక ఫీచర్లు వెల్లడయ్యాయి. ఇప్పుడు, మనం ఈ అప్‍డేటెడ్ మోడల్ యొక్క లాంచ్ టైంలైన్ వివరాలను తెలుసుకుందాం.
మహీంద్రా కంపెనీ ఇండియాలో XUV300ఫేస్‍లిఫ్ట్ ధరలను ప్రకటించడానికి అన్నీ సిద్ధం కాగా, వచ్చే ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రకటించే అవకాశం ఉంది. మహీంద్రా దాని ప్రస్తుత ఇటరేషన్ XUV300 యొక్క బుకింగ్స్ ని నిలిపివేసిందని, వాటికి సంబంధించిన లేటెస్ట్ వివరాలను మేము మీకు వివరించాము. అప్‍డేటెడ్ వెర్షన్ వస్తున్న కారణంగా ప్రస్తుత మోడల్ యొక్క ప్రొడక్షన్ ని తగ్గిస్తున్నట్లు గత నెలలో మహీంద్రా కంపెనీ నిర్ధారించింది.
2024 XUV300 చాలా సందర్భాల్లో టెస్టింగ్ చేస్తూ కనిపించగా, ఇది కొత్తగా ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రివైజ్డ్ హెడ్‌ల్యాంప్ సెటప్, కొత్త ఎల్ఈడీటెయిల్ లైట్స్, టెయిల్‌గేట్‌పై ఎల్ఈడీలైట్ బార్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ సెట్ తో వచ్చే అవకాశం ఉంది. ఇంటీరియర్ పరంగా, పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్, కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు కొత్త గేర్ లీవర్ తో రానుంది. అలాగే, ఏడీఏఎస్ (అడాస్)సూట్ ని కూడా పొందవచ్చు. ఇంకా, ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఏ మాత్రం మార్చకుండా 2024 XUV300లో కూడా వాటినే కొనసాగించవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్