- 2024 ప్రారంభంలో అరంగేట్రం చేసే అవకాశం
- కనెక్ట్ చేసిన ఎల్ఈడీ టెయిల్ లైట్స్ తో వస్తున్నట్లు నిర్దారణ
మహీంద్రా ఇటీవలే దేశంలోరాబోయే ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించింది. న్యూ ఎక్స్‌యువి300 2024 ప్రారంభంలో ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ కి సంబంధించి భారీ మార్పులను పొంది భారతదేశంలో ప్రవేశించబోతోంది.
బయటి వైపు, చిత్రంలో చూసినట్లుగా, టెస్ట్ మ్యూల్ కనెక్ట్ చేసే లైట్ బార్‌తో పూర్తిగా కొత్త ఎల్ఈడీ టెయిల్‌లైట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపర్, రూఫ్ రెయిల్స్, పొడిగించిన రూఫ్ స్పాయిలర్ మరియు సాధారణమైన యాంటెన్నా వంటి అంశాలు కూడా ఇందులో కనిపిస్తాయి.
ముందు భాగంలో, న్యూ ఎక్స్‌యువి700- వంటి ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు డిఆర్ఎల్ఎస్ సెటప్‌తో రీడిజైన్డ్ ఫేస్ ద్వారా అతిపెద్ద మార్పుతో వస్తుంది. ఇంకా ఇందులో రీడిజైన్డ్ గ్రిల్, విశాలమైన ఎయిర్ డ్యామ్స్ మరియు మునుపటి అప్‌డేట్ కంటే మరింత నిటారుగా ఉండే బానెట్‌తో కూడిన ట్వీక్డ్ బంపర్ వంటి ఇతర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
ఇంటీరియర్ విషయానికొస్తే, ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ ఎక్స్‌యువి300 క్యాబిన్ మరింత మోడరన్ అనుభూతిని కలిగిస్తుంది. ఇది కొత్త ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్ మరియు ఎయిర్‌కాన్ వెంట్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త అప్హోల్స్టరీ మరియు మరిన్ని ఇతర ఫీచర్లను పొందే అవకాశం ఉంది.
మెకానికల్‍గా చూస్తే, రాబోయే ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, మాన్యువల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌లతో జత చేయబడి కొనసాగుతుందని అంచనా వేస్తున్నాము. ఇది లాంచ్ అయిన తర్వాత, అప్‌డేటెడ్ ఎక్స్‌యువి300 టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ మరియు సెగ్మెంట్‌లోని ఇతర సబ్-4 మీటర్ల ఎస్‌యువిలకు పోటీగా కొనసాగుతుంది.