- మరికొన్ని నెలల్లో మిడ్-లైఫ్ అప్‍డేట్ ని అందుకోనున్న XUV300ఫేస్‍లిఫ్ట్
- మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చే అవకాశం
ఇండియన్ యుటిలిటీ వెహికిల్ మేకర్ మహీంద్రా ఇండియాలో దాని ఎంట్రీ-లెవెల్ కాంపాక్ట్ ఎస్‍యూవీ XUV300కి సంబంధించిన ఆర్డర్లను అధికారికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్ యొక్క ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా, ఇది దేశవ్యాప్తంగా అక్కడక్కడా టెస్టింగ్ చేస్తుండగా పలుమార్లు కనిపించింది. దీంతో ఇది మరికొన్ని నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వెలువడ్డాయి.
ఇన్వెస్టర్ మీటింగ్ లో మహీంద్రా & మహీంద్రా ఆటో & ఫార్మ్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ రాజేష్ జెజురికర్ XUV300కి సంబంధించిన ఓ ప్రశ్నకు బదులిస్తూ “మేము ఇప్పుడు నంబర్స్ పరంగా 300 మోడల్ యొక్క బుకింగ్స్ ని తీసుకోవడం ఆపివేశాము. కాబట్టి, స్పష్టంగా మేము చెబుతున్నది ఏంటి అంటే,ఈ పోయిన మోడల్ మొత్తం మిడ్-సైకిల్ రిఫ్రెష్‌తో మళ్ళీ తిరిగి వస్తుంది.” అని తెలిపారు.
ఇప్పుడు ఈ కార్ మేకర్ XUV300కి సంబంధించి బుకింగ్స్ స్వీకరించడం అధికారికంగా నిలిపివేసింది. కానీ, దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ షిప్స్ వారి వద్ద ప్రస్తుతం ఉన్న స్టాక్ ని క్లియర్ చేయడానికి కొత్త ఆర్డర్లను తీసుకుంటూనే ఉన్నారు. XUV300అప్‍డేటెడ్ వెర్షన్ మే-2024లో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
XUV300 యొక్క లేటెస్ట్ స్పై పిక్చర్స్ చూస్తే, ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి. ఇది అప్‍డేటెడ్ స్ప్లిట్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ గ్రిల్, కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ మరియు కనెక్టెడ్ ఎల్ఈడీటెయిల్‌లైట్‌లతో కొత్త ఫాసియాతో రానుంది. మరోవైపు, ఈ ఎస్‍యూవీ యొక్క ఇంటీరియర్ భాగం అంతటా పూర్తిగా మార్పులు చోటుచేసుకొని తాజాగా లాంచ్ అయిన XUV400 EL ప్రో వేరియంట్ లాగా ఉండనుంది.
ఫీచర్స్ పరంగా, XUV300ఫేస్‍లిఫ్ట్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రీడిజైన్డ్ డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ లేఅవుట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు పవర్డ్ డ్రైవర్ సీటుతో వచ్చే అవకాశం ఉంది.
మెకానికల్ గా, కొత్త XUV300 ఇంతకు ముందు లాగే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్సుతో జత చేయబడి కొనసాగవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్