- అందుబాటులో ఉన్న 9 వేరియంట్స్
- రూ. 7.49 లక్షలతో ప్రారంభమైన ధరలు
మహీంద్రా దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న XUV300 ఫేస్‌లిఫ్ట్‌ను XUV 3XO అనే కొత్త పేరుతో ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. ఈ ఎస్‌యూవీ బుకింగ్‌లు ప్రారంభమైన గంటలోపే 50,000 బుకింగ్‌ల మైలురాయిని చేరుకోవడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఇప్పుడు, 2024 జూన్ లో మహీంద్రా XUV 3XO పై వెయిటింగ్ పీరియడ్ వివరాలను ఈ ఆర్టికల్ లో మనం పరిశీలిద్దాం.
మహీంద్రా XUV 3XO, MX1, MX2, MX2 ప్రో, MX3, MX3 ప్రో, AX5, AX5 లగ్జరీ, AX7 మరియు AX7 లగ్జరీ అనే 9 వేరియంట్‌లలో రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇక వెయిటింగ్ పీరియడ్ విషయానికొస్తే, ఈ మోడల్ ప్రస్తుతం కొత్త బుకింగ్ పై 4 నుండి 6 నెలల వరకు డెలివరీ టైమ్‌లైన్ ని కలిగి ఉంది. అలాగే, ప్రాంతాన్ని బట్టి మరియు స్టాక్ లభ్యత వంటి ఇతర వివిధ కారణాలపై ఆధారపడి ఈ వెయిటింగ్ పీరియడ్ మారవచ్చు. కాబట్టి,మీకు కావాల్సిన మరింత ముఖ్యమైన సమాచారాన్ని పొందడానికి మీ సమీపంలోని అధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించవలసిందిగా మేము కోరుతున్నాము.
మెకానికల్‍గా, XUV 3XO మూడు ఇంజిన్ ఆప్షన్ లతో వచ్చింది. అవి, - 1.2-లీటర్ టర్బో ఛార్జ్డ్ మల్టీపాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్(టిసిఎంపిఎఫ్ఐ) పెట్రోల్, 1.2-లీటర్ టర్బో చార్జ్డ్ ఇంటర్‌కూల్డ్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ (టిజిడిఐ) పెట్రోల్ మరియు 1.5-లీటర్ (సిఆర్ డిఇ) డీజిల్ ఇంజిన్. ఇప్పుడు, మాకు అందిన సమాచారం ప్రకారం, డీజిల్ వెర్షన్‌లతో పోలిస్తే పెట్రోల్ వేరియంట్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది.
డెలివరీ విషయానికొస్తే, M1, MX2, MX2 ప్రో మరియు MX3 వేరియంట్‌లు మొదటివి దేశవ్యాప్తంగా డెలివరీ చేయబడినవి.అలాగే, AX7 మరియు AX7 లగ్జరీతో సహా టాప్-ఎండ్ వేరియంట్‌ల డెలివరీ ఇటీవలే ప్రారంభమైంది.
అనువాదించిన వారు: రాజపుష్ప