- 3XO మోడల్ గా వస్తున్న XUV300 ఫేస్‍లిఫ్ట్
- ఏప్రిల్ 29న వెల్లడికానున్న మహీంద్రా 3XO మోడల్ వివరాలు
ఏప్రిల్ 29న రాబోయే (అప్‍కమింగ్) XUV 3XO ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయనుండగా దాని కంటే ముందు మహీంద్రా కంపెనీ సబ్-4-మీటర్ ఎస్‍యూవీకి సంబంధించి మరొక టీజర్ ని రిలీజ్ చేసింది. ఇప్పుడు XUV300 ఫేస్‍లిఫ్టెడ్ ఇటరేషన్ 3XO మోడల్ గా వస్తుంది.
కొత్త టీజర్ లో చూస్తే, 2024మహీంద్రా XUV3XO 7-స్పీకర్ మ్యూజిక్ సిస్టంని పొందుతున్నట్లు అర్థం అవుతుంది. ఇంకా చెప్పాలంటే, ఇది హార్మన్-కార్డన్ బేస్డ్ యూనిట్ గా వస్తుంది. టీజర్ ద్వారా తెలిసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, ఈ మోడల్ పనోరమిక్ సన్ రూఫ్, రిమోట్ క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్, కొత్త ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, రీఫ్రెష్డ్ సెంటర్ కన్సోల్, కొత్త గేర్ లీవర్, మరియు మరెన్నో ఫీచర్లతో వస్తున్నట్లు వెల్లడైంది.
ముందుగా డిజైన్ గురించి చెప్పాలంటే, కొత్త XUV3XO ట్వీక్డ్ ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కొత్త గ్రిల్, రీవర్క్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, సి-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఫ్రెష్ సెట్ తో అల్లాయ్ వీల్స్, మరియు టెయిల్ గేట్ పై ఎల్ఈడీ లైట్ బార్ వంటి ఫీచర్లను అందుకోనుంది.
కొత్త మహీంద్రా XUV 3XO ఇంతకు ముందు లాగే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు ఎఎంటి యూనిట్ తో జతచేయబడి వచ్చే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత, 3XO మోడల్ టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి బ్రెజా, నిసాన్ మాగ్నైట్, మరియు రెనాల్ట్ కైగర్ వంటి మోడల్స్ తో పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్