- ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ పనోరమిక్ సన్ రూఫ్ ని పొందుతున్న మోడల్
- పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో అందించబడనున్న XUV 3XO
మొత్తానికి దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తున్న XUV 3XOని మహీంద్రా రేపే అనగా ఏప్రిల్ 29న లాంచ్ చేయనుంది. దానితో పాటుగా ధరలను కూడా ప్రకటించనుంది. లాంచ్ కి ముందుగా మహీంద్రా ఈ మోడల్ కి సంబంధించిన ఫీచర్లను మరియు ఫ్యూయల్ ఎఫిషియన్సీని వివిధ టీజర్ల ద్వారా వెల్లడించింది. ఇంకా చెప్పాలంటే, మహీంద్రా కంపెనీ ఈ మోడల్ యొక్క పేర్లను పూర్తిగా మార్చుతూ కొత్త పేర్లను తీసుకువచ్చింది. ఈ కొత్త పేర్లను కూడా ఇది వరకే మేము ఇతర ఆర్టికల్స్ ద్వారా మీకు తెలియజేశాము.
మహీంద్రా XUV 3XO కారును MX, AX, AX3, AX5, మరియు AX7 వేరియంట్లలో లగ్జరీ ప్యాక్ మరియు ప్రో వెర్షన్లలో అందించే అవకాశం ఉంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఎస్‍యూవీ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో రానుంది. ఇంకా, ఇది 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, హర్మాన్ కార్డాన్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు ఎడాస్ (ఏడీఏఎస్) సూట్ వంటి బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.
మెకానికల్ గా, మహీంద్రా XUV 3XOలో ఇది వరకు ఉన్న ఒకే విధమైన పవర్ ట్రెయిన్ ఆప్షన్ నే కొనసాగించనుంది. తాజాగా, ఈ కార్ మేకర్ ఈ మోడల్ కి సంబంధించిన ఫ్యూయల్ ఎఫిషియన్సీని మరియు పెర్ఫార్మెన్స్ ఫిగర్లను టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ ఎస్‍యూవీ 20.1 కెఎంపిఎల్ ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ మైలేజీని అందిస్తూ, కేవలం 4.5 సెకన్లలో 60కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుందని మహీంద్రా కంపెనీ తెలిపింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్