- ఈ మోడల్ ని 29 ఏప్రిల్, 2024న ఆవిష్కరించనున్న మహీంద్రా
- రివైజ్డ్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ ని పొందనున్న XUV 3XO
తాజాగా రాబోయే (అప్‍కమింగ్) XUV300 ఫేస్‌లిఫ్ట్ కొత్త పేరును XUV 3XOగా మహీంద్రా ప్రకటించింది. దీని కొత్త పేరును ప్రకటిస్తూ,ఆటోమేకర్ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్స్ డిజైన్‌ను తెలిపేందుకు మొదటి సెట్ టీజర్ ఫోటోలను కూడా అధికారిక వెబ్ సైట్ ద్వారా రిలీజ్ చేసింది. అలాగే ఇప్పుడు, రాబోయే (అప్‍కమింగ్) ఎస్‍యూవీ కొత్త టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. ముఖ్యంగా XUV 3XOఇంటీరియర్ లో ఏమేం ఉండనున్నాయో ఈ టీజర్ ద్వారా మహీంద్రా వెల్లడించింది.
రాబోయే మహీంద్రా XUV 3XO, దాని పాత వెర్షన్ లాగా కాకుండా, ఫీచర్లు మరియు టెక్ అంశాల పరంగా ఈ సెగ్మెంట్లోనే మొదటిసారిగా కొత్త ఫీచర్స్ తో వచ్చింది. ఇక్కడ ఫోటోలో చూసినట్లుగా, మోడల్ ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో వచ్చేలా సెట్ చేయబడింది. అంతేకాకుండా, డాష్‌బోర్డ్ XUV400 మాదిరిగానే కొత్తగా ఉంది. అలాగే ఇది ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త స్టీరింగ్ వీల్, రీడిజైన్డ్ హెచ్‍విఎసిప్యానెల్ మరియు ఏసీవెంట్స్ మరియు రివైజ్డ్ గేర్ లీవర్‌తో కూడిన కొత్త సెంటర్ కన్సోల్‌ను కలిగి ఉంది.
ఎక్స్‌టీరియర్ గురించి చెప్పాలంటే, XUV 3XO విలోమ సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు డ్యూయల్-ప్రొజెక్టర్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లతో ఫ్రంట్ ఫాసియాతో బెస్ట్ డిజైన్‌ను కలిగి ఉండనుంది. కారు వెనుక భాగంలో, మోడల్ కొత్త 'XUV 3XO' బ్యాడ్జింగ్‌తో పాటు పెద్ద కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లతో అడ్జస్టబుల్ ప్రొఫైల్‌ను పొందనుంది.
మెకానికల్ గా, ఇంతకు ముందు లాగే ఈమోడల్ లోని 1.5-లీటర్ డీజిల్ మరియు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో కొనసాగుతుందని భావిస్తున్నాం. లాంచ్ తర్వాత, మహీంద్రా XUV 3XO దీని సెగ్మెంట్లో టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిసాన్ మాగ్నైట్, మారుతి బ్రెజా మరియు రెనాల్ట్ కైగర్‌లకు పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్