- 9 వేరియంట్స్ లో అందుబాటులో ఉన్న XUV 3XO
- బుకింగ్స్ ప్రారంభించిన ఒక నెలలోపు విక్రయాల మార్కును సాధించినమోడల్
ఇటీవల లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO అధిక డిమాండ్‌ను కలిగి ఉండగా, దీని బుకింగ్‌లు ప్రారంభమైన మొదటి గంటలోనే ఇది స్పష్టంగా కనిపించింది. అధికారిక బుకింగ్స్ ప్రకటన వెలువడిన గంటలోపే ఈ మోడల్ 50,000 బుకింగ్‌లను నమోదు చేసింది. ఇప్పుడు, ఎంట్రీ-లెవల్ మహీంద్రా ఎస్‌యువి ఇండియా అంతటా 10,000 యూనిట్ల అమ్మకాలను అధిగమించడం ద్వారా మరో భారీ మైలురాయిని సాధించింది.
మహీంద్రా XUV 3XO ఇండియాలో ఏప్రిల్ నెల చివరిలో రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో లాంచ్ అయింది.అలాగే, కస్టమర్లు ఈ ఎస్‌యువినిMX1, MX2, MX2 ప్రో, MX3, MX3 ప్రో, AX5, AX5 లగ్జరీ, AX7 మరియు AX7 లగ్జరీ అనే 9 వేరియంట్‌ల నుండి ఎంచుకోవచ్చు.
ఫీచర్ల పరంగా చెప్పాలంటే, బేస్-స్పెక్ MX1 వేరియంట్ ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఒఆర్‍విఎంఎస్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 4 పవర్ విండోస్, వెనుక ఏసీ వెంట్స్ మరియు ఈబీడీతో కూడిన ఏబీఎస్ లతో లోడ్ చేయబడింది. అదే సమయంలో, టాప్-స్పెక్ వెర్షన్‌లో లెవెల్- 2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, (ఫస్ట్-ఇన్-సెగ్మెంట్) పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అత్యాధునిక అదనపు ఫీచర్లు లభిస్తాయి.
మెకానికల్‍గా, XUV 3XO టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్ లతో అందుబాటులో ఉంది. అలాగే, ఇందులోని ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ఉన్నాయి.
ప్రస్తుతం, మహీంద్రా XUV 3XO పైబుకింగ్ రోజు నుండి దాదాపు 6 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప