- 1.2-టర్బో పెట్రోల్ వెర్షన్ పై టెస్ట్ నిర్వహణ
- XUV 3XO మోడల్ 18.20కెఎంపిఎల్ మైలేజీని అందిస్తున్నట్లు పేర్కొన్న మహీంద్రా
లేటెస్ట్ కాంపాక్ట్ ఎస్‍యూవీల మధ్య వచ్చిన మహీంద్రా XUV 3XO మోడల్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందించబడింది. అయితే, XUV 3XO మోడల్ వివిధ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో అందించబడగా, ఇక్కడ మేము 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ తో జతచేయబడిన 1.2-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అందించే రియల్ వరల్డ్ మైలేజీని తెలుసుకోవడానికి దీనిపై టెస్టింగ్ నిర్వహించాము.
XUV 3XO మోడల్ లో అందించబడిన 1.2-లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 129bhp మరియు 230Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, ఈ ఇంజిన్ 18.20కెఎంపిఎల్ మైలేజీని అందిస్తున్నట్లు మహీంద్రా కంపెనీ పేర్కొంది. రియల్ వరల్డ్ మైలేజీ టెస్టు ద్వారా వెల్లడైంది ఏంటి అంటే, సిటీ కండీషన్లలో 3XO మోడల్ 9.6కెఎంపిఎల్ మైలేజీ అందించగా, 10.2 కెఎంపిఎల్ మైలేజీని అందిస్తున్నట్లు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే చూపించింది. అదే విధంగా ఈ కారు హైవేలపై 18.08 కెఎంపిఎల్ మైలేజీని అందించగా, 18.9 కెఎంపిఎల్ మైలేజీని అందిస్తున్నట్లు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే చూపించింది. అంటే, సగటున ఈ కారు 11.7 కెఎంపిఎల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది. 3XO మోడల్ ట్యాంక్ కెపాసిటీ 42 లీటర్లు ఉంది కాబట్టి, ఇది 492 కిలోమీటర్ల రియల్ వరల్డ్ మైలేజీని అందిస్తుందని చెప్పవచ్చు.
లేటెస్టుగా ఎన్నో కాంపాక్ట్ ఎస్‍యూవీలు రాగా, అందులో XUV 3XO మోడల్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా నిలిచి, కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. దీని డీజిల్ మోడల్ 1.5-లీటర్ యూనిట్ తో రాగా, ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఎఎంటి గేర్ బాక్సుతో జతచేయబడి 115bhp మరియు 300Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. XUV300 మోడల్ తో పోలిస్తే, XUV 3XO మోడల్ విశాలమైన బూట్ స్పేస్, మరిన్ని పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో వచ్చింది. అదే విధంగా ఈ కారు మరిన్ని టాప్-ఎండ్ ఫీచర్లతో రాగా, అందులో పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, మరియు లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) వంటి ఫీచర్లు ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్