- ఇండియాలో XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49లక్షలు
- అందుబాటులో ఉన్న 9 వేరియంట్స్ మరియు 8 కలర్స్
మహీంద్రా గత నెలలో ఇండియాలో XUV 3XO అని పిలువబడే ఫేస్‌లిఫ్టెడ్ XUV300ని లాంచ్ చేసింది, దీని ప్రారంభ ధర రూ. 7.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇప్పుడు,XUV 3XO ఇండియాలో ఉన్న డీలర్షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
ఇక్కడ చిత్రంలో చూసినట్లుగా, న్యూ XUV 3XO ఎవరెస్ట్ వైట్ షేడ్ ఫినిషింగ్ ని పొందింది. టాటా నెక్సాన్ కు పోటీగా ఉన్న ఈ మోడల్ ను 8 మోనోటోన్ కలర్స్ లో పొందవచ్చు. యూనిట్ AX5 వేరియంట్ లో, డాష్‌బోర్డ్ పైభాగంలో సాఫ్ట్-టచ్ ఫినిషింగ్ మరియు ఒఆర్విఎంఎస్-మౌంటెడ్ రియర్-వ్యూ కెమెరాలులాంటివి లేవు.
ఈ 2024 మహీంద్రా XUV 3XO MX1, MX2, MX2ప్రో, MX3, MX3ప్రో, AX5, AX5లగ్జరీ, AX7మరియు AX7లగ్జరీ అనే 9వేరియంట్లలో అందుబాటులో ఉంది. అలాగే, కస్టమర్లు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 1.2-లీటర్ టిజిడిఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ నుండి ఎంచుకోవచ్చు. ఈ ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు ఏఎంటీ యూనిట్లతో జత చేయబడ్డాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప