- రూ.30 వేల వరకు పెరిగిన ధరలు
- సెలెక్టెడ్ వేరియంట్లపై పెరిగిన ధరలు వర్తింపు
2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో మహీంద్రా కంపెనీ XUV 3XO మోడల్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు, ఇది అరంగేట్రం చేసిన అయిదు నెలల తర్వాత, కార్ మేకర్ దాని సబ్-ఫోర్-మీటర్ ఎస్‍యూవీపై మొదటిసారిగా ధరలను పెంచింది. ఈ ఆర్టికల్ ద్వారా XUV 3XOపై ఎంత వరకు ధరలు పెరిగాయో ఓసారి పరిశీలిద్దాం.
XUV 3XO మోడల్ పై రూ.30 వేల వరకు ధరలు పెరగగా, పెరిగిన ధరలు MX1 1.2 పెట్రోల్ ఎంటి, AX5 1.2 పెట్రోల్ ఎటి, MX2 1.2 పెట్రోల్ ఎంటి, మరియు AX5 1.2 పెట్రోల్ ఎంటి వెర్షన్లపై వర్తిస్తాయి. అదే విధంగా, MX3 1.2 పెట్రోల్ ఎటి, AX5L 1.2 పెట్రోల్ ఎంటి, AX5L 1.2 పెట్రోల్ ఎటి, MX2 ప్రో 1.2 పెట్రోల్ ఎంటి, MX3 1.2 పెట్రోల్ ఎంటి, మరియు MX2 ప్రో 1.2 పెట్రోల్ ఎటి వెర్షన్లపై కూడా ఇప్పుడు రూ.25 వేల వరకు ధరలు పెరిగాయి.
ఇప్పుడున్న ధరలతో పోలిస్తే, కస్టమర్లు ఎవరైతే MX2 ప్రో 1.5 డీజిల్ ఎంటి, MX3 1.5 డీజిల్ ఎంటి, MX3 1.5 డీజిల్ ఎఎంటి, AX5 1.5 డీజిల్ఎంటి, మరియు AX5 1.5 డీజిల్ ఎఎంటి వెర్షన్లను కొనుగోలు చేస్తున్నారో వారు అదనంగా రూ.10 వేల వరకు అదనపు బెనిఫిట్ పొందుతారు. ఇంకా మిగతా వేరియంట్ల ధరలలో ఎలాంటి మార్పులు లేవు.
XUV 3XOలో అందించబడిన ఎంట్రీ-లెవెల్ MX1 1.2 పెట్రోల్ ఎంటి వెర్షన్ ధరలు రూ.7.79 లక్షల నుంచి ప్రారంభం కాగా, ఇందులోని టాప్-స్పెక్ AX7L 1.2 పెట్రోల్ ఎటి వెర్షన్ ఎక్స్-షోరూం ధర రూ.15.49 లక్షలు ఉంది. నెక్సాన్ మరియు బ్రెజాతో పోటీపడుతున్న ఈ మోడల్ మూడు ఇంజిన్లు మరియు మూడు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందించబడింది. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు ఈ కారును ఎనిమిది కలర్లు మరియు తొమ్మిది వేరియంట్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్