- అందుబాటులో ఉన్న 8 కలర్స్ మరియు 9 వేరియంట్స్
- మే 26 నుండి ప్రారంభంకానున్న కార్ డెలివరీ
మహీంద్రా దాని కార్ బుకింగ్‌ల తర్వాత మొదట కారును లాంచ్ చేయడం ద్వారా అసాధారణ మార్గాన్ని అనుసరించింది. అయినప్పటికీ, ఇటీవల లాంచ్ అయిన XUV 3XO అధికారిక బుకింగ్‌లు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్ డెలివరీ మే 26 నుండి ప్రారంభం కానుంది. సమీపంలోని మహీంద్రా- అధికారిక డీలర్‌షిప్ లేదా ఈ బ్రాండ్ ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్‌ను సందర్శించి, టాటా నెక్సాన్ కి పోటీగా ఉన్న దీనిని మీరు బుక్ చేసుకోవచ్చు.
మహీంద్రా XUV 3XOని M1, M2, M2 ప్రో, M3, M3 ప్రో, AX5, AX5 లగ్జరీ, AX7 మరియు AX7 లగ్జరీ అనే 9 వేరియంట్స్ లో ఎంచుకోవచ్చు, దీని ధరల విషయానికొస్తే, ఎస్‌యువి ధరలు రూ. 7.49 లక్షల నుండి ప్రారంభమై రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)వరకు ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే, XUV 3XO 16 ఎక్స్‌టీరియర్ పెయింట్ కలర్స్ లో ఉండగా, సిట్రిన్ ఎల్లో, డీప్ ఫారెస్ట్, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, గెలాక్సీ గ్రే, నెబ్యులా బ్లూ, డ్యూన్ బీజ్ మరియు టాంగో రెడ్‌లతో సహా 8 మోనోటోన్ కలర్స్ ఉన్నాయి. అలాగే, అన్ని పెయింట్ స్కీమ్‌లను గాల్వనో గ్రే లేదా స్టెల్త్ బ్లాక్‌లో డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో కస్టమైజ్ చేయవచ్చు.
ఇతర కార్లను కొనుగోలు చేయాలనుకొని ప్లాన్ చేస్తున్న కస్టమర్లు వాటికి గట్టి పోటీనిస్తున్న మహీంద్రా XUV 3XO బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లతో వచ్చింది.
పనోరమిక్ సన్‌రూఫ్ |
ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ |
65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ |
డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ |
లెవెల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్ |
స్టాండర్డ్‌గా ఆల్-ఫోర్ డిస్క్ బ్రేక్స్ |
17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ |
మెకానికల్‍గా, మహీంద్రా XUV 3XO టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్ల తో అందుబాటులో ఉంది.1.2-లీటర్ పెట్రోల్ మోటార్స్ 109bhp/200Nm మరియు 129bhp/230Nm టార్క్ అవుట్‌పుట్‌తో రెండు ట్యూన్‌లలో అందించబడ్డాయి. అదే విధంగా, డీజిల్ ఇంజిన్ 115bhp మరియు 300Nm మాక్సిమం టార్క్‌ని ఉత్పత్తి చేయగలదు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప