- డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ని పొందుతున్న XUV 3XOమోడల్
- 29 ఏప్రిల్, 2024న ఎస్‍యూవీ లాంచ్
మహీంద్రాXUV 3XO మోడల్ అధికారిక ధరల ప్రకటన మరెంతో దూరం లేదు, మనం దానికి చాలా దగ్గరలో ఉన్నాం. అయితే, ఇదివరకే మహీంద్రా ఈ మోడల్ కి సంబంధించిన కీలక వివరాలను వివిధ టీజర్ల ద్వారా వెల్లడించింది. ఇప్పుడు, లేటెస్ట్ టీజర్ ద్వారా, ఈ ఎస్‍యూవీ ఇంటీరియర్ వివరాలతో పాటుగా మైలేజీ వివరాలను కూడా మహీంద్రా వెల్లడించింది.
ఇక్కడ ఫోటోలో చూసిన విధంగా, మహీంద్రా XUV 3XO ఇంటీరియర్ పరంగా ఇంతకు ముందు వచ్చిన XUV 300 కంటే మరిన్ని ఫీచర్లను అందుకుంటుంది. ఇది ఫ్రీ-స్టాండింగ్ 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆల్-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్, హార్మన్ కార్డన్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టం, పనోరమిక్ సన్ రూఫ్, రిమోట్ క్లైమేట్ కంట్రోల్, కొత్త స్టీరింగ్ వీల్, మరియు రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ వంటి వివిధ ఫీచర్లతో రానుంది.
ఇంకా, ఆటోమేకర్ ఈ మోడల్ మైలేజీ మరియు పెర్ఫార్మెన్స్ వివరాలను కూడా టీజర్లో వెల్లడించింది. ఇందులో ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉండగా, 3XO ఇంజిన్ ఆప్షన్లలోని ఒక ఇంజిన్ 20.1కెఎంపిఎల్ ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ మైలేజీని అందించనుంది. ఇంకా చెప్పాలంటే, ఇందులోని ఒక నిర్దిష్టమైన వేరియంట్ కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని అద్బుతమైన పెర్ఫార్మెన్స్ ని అందించనుంది.
మెకానికల్ గా, XUV 3XO ఇది వరకు ఉన్న పవర్ ట్రెయిన్ ఆప్షన్లను కొనసాగించనుండగా, వాటిలో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉండగా, అవి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్సులతో జతచేయబడి రానున్నాయి. అదే విధంగా, ఈ ఎస్‍యూవీ ధరలు 29 ఏప్రిల్, 2024న వెల్లడికానున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్