- ఇండియాలో రూ. 7.49 లక్షలతో ప్రారంభమైన XUV 3XO ధరలు
- 8 కలర్స్ తో 9 వేరియంట్‌లలో అందించబడతున్న మోడల్
మహీంద్రా కంపెనీ తక్షణమే XUV 3XO ఫీచర్ లిస్ట్ ను అప్‌డేట్ చేసింది. ఎందుకంటే, దీనికి సంబంధించి ఒక డాక్యుమెంట్ ఇంటర్నెట్లో లీక్ అయ్యింది. దీంతోమారుతి బ్రెజా మరియు టాటా నెక్సాన్‌లకు పోటీగా ఉన్న సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువికి వర్తించే ఫీచర్ రివిజన్‌ను మహీంద్రా వెల్లడించింది.
ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో కొత్త మహీంద్రా XUV 3XO, రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇది ముందు మరియు వెనుక వరుసలలో 15W యూఎస్‌బి టైప్-సి ఛార్జర్ ను పొందింది. అలాగే, ఈ ఫీచర్ కేవలం MX1 వేరియంట్‌కుమాత్రమే వర్తిస్తుండగా, మొదటి ఆప్షన్స్ లో ఉన్న ముందు మరియు వెనుక వరుసగా టైప్-ఎ మరియు టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి.
మహీంద్రా ఈ వారం ప్రారంభంలో, దాని పాపులర్ ఎస్‌యువి, స్కార్పియో N ని అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఇది వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్, బ్లాక్ సెంటర్ కన్సోల్ మరియు కొత్త మిడ్‌నైట్ బ్లాక్ పెయింట్ వంటి అప్ డేటెడ్ ఫీచర్లతో వచ్చింది.ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, పైన పేర్కొన్న ఫీచర్లు కేవలం Z8S వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి, వాటి వివరాలను మా వెబ్‌సైట్‌లో చదవవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప