- రూ.7.49 లక్షలతో ధరలు ప్రారంభం
- ఒక గంటలోనే 50,000 బుకింగ్‌లను సాధించిన XUV 3XO
మహీంద్రా XUV 3XO, XUV300 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను గత నెలలో ఇండియాలో లాంచ్ చేసింది. అప్‌డేటెడ్ టాటా నెక్సాన్ కు పోటీ ఉన్న XUV 3XO రూ. 7.49 లక్షలు ప్రారంభ ధరతో 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది.దీని ధర ప్రకటించిన తర్వాత, ఆటోమేకర్ ఎస్‌యువిల బుకింగ్‌లను ప్రారంభించగానే, ఒక గంటలోపే 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను నమోదు చేసి కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పుడు, రేపటి నుండి XUV 3XO డెలివరీలు ఇండియాలో ప్రారంభం కానున్నాయి.
కస్టమర్లు XUV 3XOని M1, M2, M2 ప్రో, M3, M3 Pro, AX5, AX5 లగ్జరీ, AX7 మరియు AX7 లగ్జరీ అనే 9 వేరియంట్స్ నుండి బుక్ చేసుకోవచ్చు. అలాగే, ఈ మోడల్ ను ఇప్పటికే ఆర్డర్ చేసిన కస్టమర్‌లు, రేపటి నుండివారి వారి ఎస్‌యువిల డెలివరీ ను స్వీకరించడం ప్రారంభిస్తారు.
కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే, మహీంద్రా XUV 3XO, 8 మోనోటోన్ మరియు 9 డ్యూయల్-టోన్ కలర్ తో సహా 16 ఎక్స్‌టీరియర్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా, ప్రైమరీ(ప్రాథమిక) కలర్స్ ఏవి అంటే, సిట్రిన్ ఎల్లో, డీప్ ఫారెస్ట్, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, గెలాక్సీ గ్రే,నెబ్యులా బ్లూ, డ్యూన్ బీజ్ మరియు టాంగో రెడ్.
మెకానికల్‍గా, మహీంద్రా XUV 3XO రెండు టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. 1.2-లీటర్ పెట్రోల్ మోటార్స్ 109bhp/200Nm మరియు 129bhp/230Nm టార్క్ పవర్ అవుట్‌పుట్‌తో రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ తో అందించబడతాయి.మరోవైపు, డీజిల్ ఇంజిన్ 115bhp మరియు 300Nm మాక్సిమం టార్క్‌ని ఉత్పత్తి చేయగలదు. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప