- అందుబాటులో ఉన్న9 వేరియంట్స్
- రూ.7.49లక్షలతో ధరలు ప్రారంభం
మహీంద్రా XUV300 ఇటీవల లాంచ్ చేసిన XUV 3XO విలువైన, అత్యంత అవసరమైన అప్‌డేట్‌ను పొందింది. కొత్త పేరు మరియు వేరియంట్‌లతో, అప్‌డేట్ చేయబడిన సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యువి లోపలి భాగంలో పూర్తి మార్పుల ద్వారా బెనిఫిట్ పొందుతుంది. ఇప్పుడు, నేటి నుండి, మోడల్‌ను బుక్ చేసుకున్న కస్టమర్‌లు ఇండియాలో కస్టమర్లు వారి ఎస్‌యువిలను స్వీకరించడం ప్రారంభించారు.
మహీంద్రా XUV 3XO M1, M2, M2 ప్రో, M3, M3 ప్రో, AX5, AX5 లగ్జరీ, AX7 మరియు AX7 లగ్జరీ అనే 9 వేరియంట్‌లలో రూ.7.49 లక్షలుఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
ఫీచర్ల వారీగా చూస్తే, XUV 3XO డ్యూయల్ 10.25-ఇంచ్ డిస్‌ప్లేలతో ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వెనుక ఏసీ వెంట్స్, లెవెల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్ తో పనోరమిక్ సన్‌రూఫ్వంటి ఫీచర్లతో లోడ్ చేయబడింది.
హుడ్ కింద, మహీంద్రా XUV 3XO మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అందించబడుతుంది. 1.2-లీటర్ పెట్రోల్ మోటార్ 109bhp/200Nm మరియు 129bhp/230Nm టార్క్ పవర్ అవుట్‌పుట్‌తో రెండు టర్బో రకాలలో అందించబడగా, అదే విధంగా , 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 115bhp మరియు 300Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్విషయానికొస్తే, ఈ ఇంజిన్‌లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడి ఉంటాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప