- XUV 3XO ఎక్స్-షోరూం ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు
- ప్రారంభమైన ఎంట్రీ-లెవల్ వేరియంట్ల డెలివరీ
ఇండియన్ కార్ మేకర్ మహీంద్రా XUV300ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను XUV 3XOగా ఏప్రిల్ 2024లో ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అప్పటినుంచి ఈ మోడల్ బుకింగ్స్ పరంగా దుమ్ములేపుతుంది. అయితే, ఈ మోడల్ లాంచ్ అయిన వెంటనే మే చివరి వారం నుంచి కస్టమర్లకు డెలివరీ చేయడం కూడా ప్రారంభమైంది. కానీ, ఈ డెలివరీ ప్రాసెస్ దశల వారీగా ప్రారంభమైంది. ఎలా అంటే, XUV 3XO మిడ్-స్పెక్ మరియు టాప్-స్పెక్ వేరియంట్లు డెలివరీ ప్రస్తుతం కొనసాగుతుండగా, ఇప్పుడు XUV3XOఎంట్రీ-లెవల్ MX1 వేరియంట్ డీలర్‌షిప్స్ కి చేరుకోవడం, తర్వాత ఇండియా అంతటా డెలివరీ చేయడం కూడా ప్రారంభమైంది.
ప్రస్తుతం, మహీంద్రా XUV 3XO మోడల్రూ. 7.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. ఈ ధరతో లభ్యమవుతున్న 3XO కారు MX1 వేరియంట్‌లో హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎంలపై ఎల్ఈడీ ఇండికేటర్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, ఈబీడీతో ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్టీరింగ్ మోడ్స్, నాలుగు పవర్ విండోలు, రియర్ ఏసీవెంట్స్, కారులో ఉన్న ప్యాసింజర్లు అందరికీ త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్స్ మరియు రిమైండర్ సిస్టమ్ మరియు స్టోరేజ్‌తో పాటుగా ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా XUV 3XO మోడల్ ఎంట్రీ-లెవెల్ MX1 వేరియంట్ కారు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో రాగా, ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో మాత్రమే జతచేయబడి 109bhp మరియు 200Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్