- ఇండియాలో రూ. 7.49 లక్షలతో XUV 3XO ధరలు ప్రారంభం
- ప్రస్తుతం 55వేల కార్లకు పైగా ఉన్న బుకింగ్స్
మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్‌గా పిలువబడే XUV 3XOని ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది, దీనిని రూ. 7.49 లక్షలు ప్రారంభ (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు. ఈ మోడల్ ధరలు వెల్లడైన మూడు నెలల తర్వాత, ఇండియన్ మార్కెట్‌లో ఈ మోడల్ కి ఉన్న డిమాండ్ (ప్రతిస్పందనను) బట్టి మేము కొన్నింటిని మీ ముందుకు తీసుకువస్తున్నాము.
మహీంద్రా ప్రకారం చూస్తే, టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి మరిన్నింటి కార్లకు పోటీగా ఉన్న XUV 3XO, జూలై 2024 నాటికి ప్రతి నెల 20వేలకు పైగా కొత్త బుకింగ్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇంకా దాదాపు 55 వేలకు పైగా కార్లను డెలివరీ చేయాల్సి ఉందని మహీంద్రా కంపెనీ పేర్కొంది. అలాగే, ఈ నంబర్లు అన్నీ పైన పేర్కొన్న పీరియడ్ కి సంబంధించినవి. ముఖ్యంగా చెప్పాలంటే,XUV 3XO లాంచ్ అయిన (వెంటనే) చాలా తక్కువ కాలంలో 50వేల బుకింగ్‌లను నమోదు చేసింది.
మహీంద్రా ఇటీవలి కాలంలో మరింత విజయవంతంగా కొనసాగుతోంది. ఎలా అంటే, ఏప్రిల్- 2024లో XUV3XOను లాంచ్ చేయగా, దాని తర్వాత ఈ నెల (ఆగస్టు) ప్రారంభంలో థార్ రాక్స్ ని కూడా ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. అంతటితో ఆగకుండా, ఈ లాంచ్ ల తరువాత ఈ సంవత్సరం చివరిలో XUV.e8 అనే ఈవీని కూడా లాంచ్ చేయనుంది. అలాగే, ఈ XUV700-బేస్డ్ ఈవీ తర్వాత XUV.e9, XUV 3XO ఈవీ, BE.05 మరియు మరిన్ని ఇతర ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు కూడా మరి కొద్ది నెలల్లో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప